హిందువుగా నివసిస్తున్న బంగ్లాదేశీ పోర్న్ స్టార్ ముంబైలో అరెస్ట్

హిందువుగా నివసిస్తున్న బంగ్లాదేశీ పోర్న్ స్టార్ ముంబైలో అరెస్ట్
ఫేక్ సర్టిఫికేట్లతో భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ పోర్న్ స్టార్ రియా అరవింద బర్డేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. రియా బర్డేతోపాటు ఆమె సోదరి, సోదరుడిని కూడా థానే జిల్లా ఉల్హాస్ నగర్​లో అదుపులోకి తీసుకున్నారు. వారంతా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి నకిలీ భారత పాస్‌పోర్ట్‌లతో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. మరోవైపు రియా బర్డే తల్లి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. 
 
వారి వద్ద న‌కిలీ ఇండియా పాస్‌పోర్టును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో హిందువులుగా నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  రియా బార్డే తన తల్లి అంజలి బార్డేను (అలియాస్​ రూబీ షేక్), సోదరుడు రవీంద్ర (అలియాస్​ రియాజ్ షేక్), సోదరి రీతు (అలియాస్​ మోనీ షేక్​)తో కలిసి భారతదేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు.
 
పోర్న్ ఇండస్ట్రీలో రియా బర్డే తన పేరును ఆరోహి బర్డే, బన్నా షేక్‌గా మార్చుకున్నట్లు పేర్కొన్నారు. పోర్న్, సీ గ్రేడ్ చిత్రాల్లో రియా బర్డే నటిస్తున్నట్లు పేర్కొన్నారు.  రియా బర్డే తల్లి బంగ్లాదేశీ అయినప్పటికీ భారత ధ్రువీకరణ పత్రాలను పొందడానికి మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ వ్యక్తిని కూడా వివాహం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
ప్రస్తుతం రియా బర్డేతో పాటు ఆమె తల్లి అంజలి బర్డే అలియాస్ రూబీ షేక్, తండ్రి అరవింద్ బర్డే, సోదరి రీతూ అలియాస్ మోనీ షేక్, సోదరుడు రవీంద్ర అలియాస్ రియాజ్ షేక్‌లను కూడా పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్ట్ చేశారు.  రియా బర్డే చాలా ప్రొడక్షన్ హౌస్‌లతో సంబంధం కలిగి ఉందని, ఎన్నో పోర్న్ ఫిల్మ్స్‌లో నటించిందని పోలీసులు వెల్లడించారు. నటి గెహనా వశిష్ట్​తో కలిసి పలు చిత్రాల్లో ఆమె నటించారు. ఆమ్రాస్ (2023) అనే సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు ఉందని ఫిల్మ్ సైట్ ఐఎండీబీ తెలిపింది.
రియా బర్డే గుర్తింపుపై ఏడాది క్రితం దర్యాప్తు ప్రారంభించామని, ఆమె బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాస్​పోర్టులో పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, హుగ్లీ, మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అచల్పూర్ అనే మూడు వేర్వేరు జన్మ స్థలాలు ఉన్నాయని తేలిందని పోలీసులు వివరించారు.  బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చి మహారాష్ట్రలో నివాసముంటున్న వారిలో 8మందిని ఈ వారంలో పోలీసులు అరెస్ట్​ చేశారు. వారిలో రియా బార్డే ఒకరు.
 
అయితే రియా బర్డే తల్లి రూబీ షేక్ తాను పశ్చిమ బెంగాల్‌ వాసినని చెప్పి అమరావతికి చెందిన అరవింద్ బర్డేను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లి తర్వాత నకిలీ బర్త్ సర్టిఫికేట్లతో పాటు, ఇతర సర్టిఫికేట్లను వారంతా తయారు చేసుకున్నారని,వాటిని ఆధారంగా చేసుకుని ఫేక్ ఇండియన్ పాస్‌పోర్టు కూడా పొందినట్లు తెలిపారు.  రియా తల్లిదండ్రులు ప్రస్తుతం ఖతార్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. 
 
వ్యభిచారానికి సంబంధించిన కేసులో గతంలో రియా బర్డేను ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. రియా బర్డే బంగ్లాదేశ్‌కు చెందినదని.. అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్లు ఆమె స్నేహితుడు ప్రశాంత్ మిశ్రాకు తెలియడంతో.. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. రియా బర్డే మతం అంశం చర్చనీయాంశంగా మారింది. ఆమె మతం ఏంటి? ఎక్కడ నుంచి వచ్చిందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.