
తెలంగాణ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు.
సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు. కాగా, తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న తరుణంలో గత లోక్ సభ ఎన్నికలలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత వందేభారత్ రైలులో తిరుపతికి బయలుదేశారు.
ఆలయ హుండీలో ‘క్షమా ప్రార్థన పత్ర’ (క్షమాపణ లేఖ) సమర్పిస్తానని బీజేపీ నాయకురాలు మాధవీలత చెప్పారు. ఇలాంటి లేఖలు రాయడానికి ఇష్టపడే ఇతరులను ఆలయ హుండీలో సమర్పించేందుకు వీలుగా వాటిని తనకు అందజేయాలని ఆమె కోరారు. హైదరాబాద్ నుంచి వందే భారత్ రైలులో తిరుపతికి ప్రయాణిస్తూ గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు.
మాధవీలత. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటే. అది అత్యాచారం కిందికే వస్తుందంటూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేభారత్‌లో మాధవీలత భజనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి