
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు లో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో జరుగుతున్న వివాదం నేపథ్యం లో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ప్రకాశ్ రాజ్ అనుచితంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఫిల్మ్ ఛాంబర్ “మా” మూవీ అసోసియేషన్ ముందు భారతీయ జనతా యువమోర్చా అధ్యర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించి దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యకుడు సెవెళ్ళ మహేందర్ మాట్లాడుతూ గతంలో చాలా సార్లు హిందూ దేవుళ్లపైన, ఆచారాలపైన వ్యతిరేకంగా మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఈ సారి కూడా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరుగుతున్న కల్తీ పైన విచారం వ్యక్తం చేయకపోగా వ్యంగంగా పోస్ట్ చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లౌకిక వాదిగా, మేధావిగా తనని తాను సమాజానికి పరిచయం చేసుకుంటున్న ప్రకాష్ రాజ్ కేవలం హిందూ ధర్మం పైన, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తను తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ వెంకటేశ్వర స్వామి తనకి మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుతూ “మా” అసోసియేషన్ లో తన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన షూటింగ్ లు, సినిమాలను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర ఉప అధ్యక్షులు మహేష్ కూడా పాల్గొన్నారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం