బీజింగ్ కల్లోలం కారణంగానే చైనా సైనికీకరణ

బీజింగ్ కల్లోలం కారణంగానే చైనా సైనికీకరణ
పెరుగుతున్న చైనా సైనికీకరణ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బీజింగ్ లో ఎదుర్కొంటున్న కల్లోలం కారణంగానే ఇది జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్పష్టం చేశారు. క్వాడ్ లోని ఇండో-పసిఫిక్ మిత్రదేశాల శిఖరాగ్ర సదస్సులో మాటాడుతూ ఈ ప్రాంతాన్ని పరీక్షించే ప్రయత్నం తాము చేస్తున్నట్లు తెలిపారు. 
 
తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్ సమీపంలో జరిపిన క్వాడ్ నాయకుల ఆరవ సదస్సు ముందు మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారితో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచుకొనేందుకు చైనా కష్టపడుతోందని,  డిమాండ్‌ను ప్రోత్సహించేందుకు ఖర్చులను పెంచడానికి బీజింగ్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున పారిశ్రామిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ ధరలలో విస్తరించిన మందగమనాన్ని చూస్తున్నదని చెప్పారు.
 
“చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో మనందరినీ పరీక్షిస్తుంది.  దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా, దక్షిణాసియా,  తైవాన్ జలసంధిలలో ఇది నిజం” అని బిడెన్ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాలతో కలిసి స్పష్టం చేశారు.
 
 “కనీసం మన దృక్కోణం నుండి, (చైనీస్ ప్రెసిడెంట్) జి జిన్‌పింగ్ దేశీయ ఆర్థిక సవాళ్లపై దృష్టి పెడుతున్నారని, చైనా దౌత్య సంబంధాలలో గందరగోళాన్ని తగ్గించాలని చూస్తున్నారని మనం విశ్వసిస్తున్నాము. అతను నా దృష్టిలో, చైనా ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించడానికి కొంత దౌత్య పక్రియ పట్ల ఆసక్తి చూపుతారని భావిస్తున్నాను”  అని బిడెన్ తెలిపారు.
 
2018 నాటి వాణిజ్య యుద్ధంతో ప్రారంభించి, చైనా , అమెరికాల మధ్య అంతర్జాతీయ భద్రత  నుండి దక్షిణ చైనా సముద్రంపై చైనా వాదనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానల్ తయారీపై పారిశ్రామిక విధానం వరకు అనేక సమస్యలపై విభేదాలను తలెత్తుతున్నాయి.  తైవాన్‌పై చైనా దూకుడు గురించి, ఇటీవల దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతాలలో చైనా- ఫిలిప్పైన్ నౌకల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని అమెరికా పదేపదే ఆందోళనలు వ్యక్తం చేసింది.
 
శిఖరాగ్ర సమావేశంలో, ఈ ప్రాంతంలోని అమెరికా  నౌకల్లో భారతీయ, జపాన్, ఆస్ట్రేలియా సిబ్బంది ప్రయాణించేటటువంటి అవకాశాలను, సామర్థ్యాలను మెరుగుపరచడానికి క్వాడ్ దేశాల కోస్ట్ గార్డ్‌ల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు నాయకులు అంగీకరించారు. అయితే ఆ రవాణాలో పోటీలో ఉన్న దక్షిణ చైనా సముద్రం కూడా ఉంటుందో లేదో అమెరిగా అధికారులు చెప్పలేదు.
 
అమెరికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు జపాన్ నాయకులు శిఖరాగ్ర సమావేశం తర్వాత మాట్లాడుతూ, దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో ఉద్రిక్తతలపై తాము “తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము” అని ప్రకటించారు. బీజింగ్ పేరును నేరుగా ప్రస్తావించకుంటానే, “తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో పరిస్థితి గురించి మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము” అని వారు ప్రకటించారు. 
 
 “మేము పనులను ఎలా పూర్తి చేయాలో తెలిసిన ప్రజాస్వామ్య దేశాలు. అందుకే నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజుల్లోనే నేను మీలో ప్రతి ఒక్కరిని, మీ దేశాలను సంప్రదించి క్వాడ్‌ను ఉన్నతీకరించాలని ప్రతిపాదించాను, ఇది మరింత పర్యవసానంగా మారింది” అని జో బిడెన్ చెప్పారు. జ
 
తన ప్రారంభ వ్యాఖ్యలలో. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, “ప్రధాని మోదీ వచ్చే ఏడాది మనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. నేను దాని కోసం కూడా ఎదురు చూస్తున్నాను… క్వాడ్ ద్వారా మన నాలుగు దేశాలు సహకరించుకుంటాయి. మన సమాజం గాని,   ప్రాంతం మొత్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై మనం సమన్వయం చేస్తాము. క్వాడ్ ద్వారా, ఈ ప్రాంతంలోని దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అర్ధవంతమైన మార్గాల్లో దోహదపడేందుకు మనం మన ముఖ్యమైన వనరులు, నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటాము” అని చెప్పారు.
 
క్వాడ్ నేతల సదస్సుకు ముందు విల్మింగ్టన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా బలవంతపు, అస్థిరపరిచే కార్యకలాపాలపై బిడెన్, కిషిడా తమ ఆందోళనను వ్యక్తం చేశారు. “ఇద్దరు నాయకులు తైవాన్ జలసంధి అంతటా శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. యథాతథ స్థితిని బలవంతంగా మార్చే ప్రయత్నాలకు తమ వ్యతిరేకతను స్పష్టం చేశారు” అని వైట్ హౌస్ తెలిపింది.
 
 “నా పదవీకాలంలో, నేను క్వాడ్ ప్రయత్నాలను నిలకడగా స్పష్టం చేస్తూ వచ్చాను.  నా స్వస్థలమైన హిరోషిమాలో జరిగిన చివరి సమావేశం తరువాత, ఈ సమావేశం, ప్రధానిగా నా చివరి విదేశీ పర్యటనకు తగినదని  నమ్ముతున్నాను”అని శిఖరాగ్ర సమావేశంలో కిషిడా పేర్కొన్నారు. ప్రాంతీయ దేశాలతో సమన్వయం చేసుకోవడం, క్వాడ్ సామూహిక దృష్టిని సాకారం చేసుకోవడం ఎంత ముఖ్యమో జపాన్ ప్రధాని ప్రస్తావించారు.