ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే నివాసముండాలి

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు మాత్రమే నివాసముండాలి
1/70 యాక్ట్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర  గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు మరియు అధికార బృందం. కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అక్కడ నివసిస్తున్న గిరిజనులపై పోలీసుల అక్రమ కేసులు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గిరిజన చట్టం 1/70 ప్రకారం గిరిజన ప్రాంతాలలో గిరిజనులు మాత్రమే నివాసముండాలని బిజెపి గిరిజన మోర్చా తెలంగాణ స్పష్టం చేసింది.
 
ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్  నాయకత్వంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మను గురువారం కలిసి సమర్పించిన వినతిపత్రంలో ఆ జిల్లాలో 500కి  పైగా ముస్లిం  కుటుంబాలు షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారన్ని, అదేవిధంగా
అసిఫాబాద్ జిల్లాలో నివసిస్తున్న 64కి పైగా ముస్లిం కుటుంబాలు గిరిజన ఆదివాసి మహిళలను లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. 
 
అదేవిధంగా అక్కడ నివసిస్తున్న గిరిజన ఆదివాసులపై ముస్లిం కుటుంబాలు ఆధిపత్య పోరు చెలాయిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ ఇండ్లు, ప్రభుత్వ పథకాలను అక్రమంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో గిరిజనులపై దాడులు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఓట్ల కోసం పాకులాడడం సిగ్గుచేటని విమర్శించారు.
 
గిరిజన సాంప్రదాయాలను ధ్వంసం చేస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్న వారిని తరిమి వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చట్టం అమలు చేసేటట్టు ప్రభుత్వానికి ఆదేశించగలరని గవర్నర్ ను కోరారు. వారి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి త్వరలో ఆసిఫాబాద్ జిల్లా జైనురు కి వచ్చి గిరిజనులకు వెంటనే న్యాయం చేస్తానని, పీసా చట్టం అమలు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బిజెపి ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కు నాథ్ నాయక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నేనావత్ రవి నాయక్, కొట్నాక విజయ్, ఉపాధ్యక్షులు రాజు రాథోడ్, బిజెపి రాష్ట్ర నాయకులు రితేష్ రాథోడ్ , ఎస్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బానోత్ అనూష, మహిళా విభాగం కన్వీనర్    బానోత్ జ్యోతి తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.