
జైనూర్ లో వనవాసి మహిళపై అత్యాచారం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడు షేక్ ముగ్దమ్ పై వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ జరిపించాలని వనవాసి సమాజ పెద్దలు జరిపిన సమావేశంలో డిమాండ్ చేశారు. హత్యాయత్నంకు పాల్పడిన దుండగునికి విచారణ అనంతరం ఉరిశిక్ష విధించాలని కోరారు.
జైనుర్ పట్టణ కేంద్రంలోని ఏజెన్సీ ప్రాంతం చట్టాలను అనుగుణంగా 1950 సంవత్సరాల తర్వాత వలస వచ్చిన ముస్లింలను జైనూర్ ప్రాంతం నుంచి ప్రభుత్వం వెంటనే తరలించాలని వారు డిమాండ్ చేశారు. జైనూర్ లో నివాసముంటున్న ముస్లింల 1950 తర్వాత వచ్చిన వారి భూ బదలాయింపు యజమాన్య హక్కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్ లను పూర్తిగా వెంటనే రద్దు చేయాలని కోరారు.
వారి కరెంట్ మీటర్లు తొలగించాలని, వ్యాపార హక్కులు పూర్తిగా రద్దు చేయాలని వారు స్పష్టం చేశారు. అట్లాగే జైనురు ఘటనలో వనవాసిలపై ఎదురుదాడి చేసిన మైనార్టీ ముస్లింలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యాయత్నం కేసులు చేయాలని స్పష్టం చేశారు. మైనార్టీ ముస్లింలకు మద్దతు పలుకుతున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని వారు తేల్చి చెప్పారు.
వనవాసి మహిళను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందించి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ కొడప నగేష్, జిల్లా అధ్యక్షుడు నైతం శేఖర్ బిరుదు గోండు తోటి సంగాం, బోధ డివిజన్ కో కన్వీనర్ ఆత్రం మహేందర్, సిడం మురళీకృష్ణ, కాత్లీ విట్టల్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి