తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు రైల్వే ప్రయాణం పైన ప్రభావం చూపాయి. వరంగల్, విజయవాడ సమీపంలో ట్రాక్ లు దెబ్బ తిన్నాయి. వర్షాలు పూర్తయితే ట్రాక్ పునరుద్దరణ పనులు ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రెండు రోజులపాటు 99 రైళ్లు రద్దు చేసారు. 54 రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ కాజిపేట మార్గంలో 30 రైళ్లు నిలిపివేసారు. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్స్ ప్రాంభించారు.
భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ లు దెబ్బ తిన్నాయి. మరి కొన్ని చోట్ల ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో, పలు రైళ్లు మధ్యలోనే నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు.. పునరుద్ధరణ పనులు చేపట్టారు. దక్షణి మధ్య రైల్వే అధికారులు వరద ప్రభావిత ప్రాంతంలో క్యాంపింగ్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
సమీప బస్టాండ్స్ కు ప్రయాణీకులను తరలించి బస్సుల ద్వారా గమ్య స్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు కీలక స్టేషన్లలో ప్రయాణీకులకు సమాచారం కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసారు.
హైదరాబాద్: 27781500, సికింద్రాబాద్: 27786140. 27786170, కాజీపేట: 27782660, 8702576430, వరంగల్: 27782751, ఖమ్మం: 27782985, 08742-224541,7815955306, విజయవాడ: 7569305697, రాజమండ్రి: 0883-2420541,0883-2420543. రైల్వే నిలయంలో డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. మహబూబాబాద్, కేసముద్రంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులకు సమయం పడుతుందని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతామని పేర్కొన్నారు. సికింద్రాబాద్, ఖమ్మం, కాజిపేట్ వరంగల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.
విశాఖపట్టణం- నాందేడ్ రైలును విజయవాడ గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు. విశాఖపట్టణం తిరుపతి రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా మళ్లించగా, తాంబరం-హైదరాబాద్ రైలును గుంటూరు నల్గొండ పగిడిపల్లి మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా.. దానపూర్-బెంగళూర్ రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, ధర్మవరం మీదుగా మళ్లించినట్లు వెల్లడించారు.
ఇక, నిజాముద్దీన్ కన్యాకుమారి రైలును కాజిపేట, సికింద్రాబాద్, సులేహల్లి, గుంతకల్లు, కడప, రేణిగుంట, అరక్కొణం, చెన్పై బీచ్ మీదుగా మళ్లించగా, సీఎస్టీ ముంబై- భువనేశ్వర్ రైలును సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించినట్లు వెల్లడించారు.
భువనేశ్వర్- సీఎస్టీ ముంబై రైలును విజయవాడ, గుంటూరు. పగడిపిల్లి, సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు. కాగా, విశాఖపట్టణం-ఎల్టీటీ ముంబై రైలును విజయవాడ గుంటూరు పగడిపల్లి సికింద్రాబాద్ మీదుగా మళ్లించిన అధికారులు..విజయవాడ హైదరాబాద్ రైలును విజయవాడ గుంటూరు నల్గొండ, పగడిపల్లి, సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!