హురూన్ ఇండియా వెలువరించిన జాబితాలో రూ.11.61 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 95 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. రూ.10.14 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద ఏడాది కాలంలో 25 శాతం మాత్రమే పెరిగింది.
రూ.3.14 లక్షల కోట్ల సంపదతో హెచ్సీఎస్ ఛైర్మన్ శివ నాడార్ మూడో స్థానంలో, రూ.2.89 లక్షల కోట్ల ఆస్తితో సీరమ్ ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా నాలుగో స్థానంలో ఉన్నారు. రూ.2.50 లక్షల కోట్ల సంపదతో సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఐదో స్థానంలో నిలిచారు.
హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 నివేదిక ప్రకారం, అప్పట్లో గౌతమ్ అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ.4.47 లక్షల కోట్లకు పడిపోయింది. దీనితో ముకేశ్ అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద అప్పట్లో భారీగా పడిపోయింది.
2014లో అదానీ సంపదను రూ.44,000 కోట్లుగా హురున్ అంచనా వేసింది. అప్పుడు భారత అత్యంత సంపన్ను జాబితాలో పదో స్థానంలో నిలిచారు. కానీ ఇప్పుడు భారత్లోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు.
హురూన్ వెలువరించిన బిలియనీర్ జాబితాలో జోహో కంపెనీకి చెందిన రాధా వెంబు రూ.47,500 కోట్ల సంపదతో మహిళల్లో అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. జెప్టో వ్యవస్థాపకుడైన 20 ఏళ్ల కైవల్య వోహ్రా రూ.4,300 కోట్ల సంపదతో బిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతి పిన్న వయసులోనే ఈ అరుదైన ఘనతను ఆయన సాధించారు. మరో సహ వ్యవస్థాపకుడు అదిత్ పలిచా రూ.3600 కోట్ల సంపదతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హురూన్ బిలియనీర్ జాబితాలో తొలిసారి చోటు సంపాదించారు. ఆయన సంపద రూ.7,300 కోట్లుగా హురూన్ నివేదిక తెలిపింది. ఈసారి ఆశ్చర్యకరంగా 16 మంది ప్రొఫెషనల్స్ బిలియనీర్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అరిస్టా నెట్వర్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జయశ్రీ ఉల్లాల్ రూ.32,100 కోట్లతో బిలియనీర్గా నిలిచారు. డీమార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇగ్నేషియస్ నవిల్ నొరోన్హా రూ.6,900 కోట్లతో బిలియనీర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

More Stories
రష్యా చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలతో భారత్ కు ముప్పు?
త్రివిధ దళాలకు రూ.79 వేల కోట్ల రక్షణ కొనుగోళ్లు
మెహుల్ చోక్సీ అప్పగింతలో అడ్డంకులు లేవన్న బెల్జియం కోర్టు