
ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వబడిన పెన్షన్, ద్రవ్యోల్బణ సూచిక డియర్నెస్ రిలీఫ్, ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందిస్తుందని ఆయన తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సుమారు 18 వేల మంది ఉద్యోగులు దీని ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలిపారు.
కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక నిపుణులతో విస్తృత సంప్రదింపుల అనంతరం పాలసీ రూపొందించామని ఆయన చెప్పారు. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) చందాదారులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన ఏకీకృత పెన్షన్ పథకం ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ది పొందుతారని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్లోని దక్షిణ మధ్య రైల్వే డివిజన్లోని మొత్తం 18,000 మంది ఉద్యోగుల్లో దాదాపు 14,000 మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు