
ఎంతో హంగామా చేస్తున్న హైడ్రా అధికారులకు సల్కం చెరువులో ఉన్న ఓవైసీ భూములను కూల్చే దమ్ముందా.? ఆ అక్రమ కట్టడాలు కమీషనర్ గారికి కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కమిషనర్‌కు కనిపించకుంటే తాను వచ్చి చూపిస్తా అని, వారి దగ్గర తగిన జేసీబీలు లేకుంటే తానే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తా అని ఆయన స్పష్టం చేశారు.
పాతబస్తీ చెరువుల కబ్జాల గురించి కమీషనర్ గారికి అవగాహన ఉందా? పాతబస్తీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా? పంపించలా? అని ప్రశ్నించారు. గత 20సంవత్సరాలుగా ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటే ఇష్టానుసారంగా భూములు, చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ధ్వజమెత్తారు.
హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలని చెబుతూ మీ బుల్డోజర్లకు పాతబస్తీ వెళ్లడానికి డీజీల్ లేదా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సమస్యలను పక్కదోవ పట్టించడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హైడ్రా పేరుతో సంచలనం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కేవలం వారం, పది రోజుల్లోనే 49 ఎకరాలు రికవరీ చేసామని చెప్తున్నారని అంటూ రాష్ట్రంలోని లక్షల ఎకరాల్లో భూమి అన్యాక్రాంతం అయ్యిందని, కోట్ల బిల్డింగులు నిర్మాణం అయ్యాయని లెక్కలు చెప్తున్నారని అంటూ ఎప్పుడు రికవరీ చెస్తారో చెప్పాలి? అంటూ మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. కొంతమంది టార్గెట్‌గా హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోందని చెప్పారు.
గడిగిన 20ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన అక్రమాలలో జరిగిన నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటారా? అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అయ్యప్ప సొసైటీ విషయంలో హైడ్రామా చేసిందని చెబుతూ అదే మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పని చేస్తోందా.? అని ప్రశ్నించారు.
హైదారాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అన్యాక్రాంతం అయిన భూముల లెక్కపై శ్వేత పత్రం విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలేవీ? అని అడిగారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతం అయిన భూములపైన శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు.
జీఎచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నట్టు, దాదాపు 300 చెరువులు కబ్జాకు గురైనట్టు లెక్కలు చెప్తున్నాయని బిజెపి నేత గుర్తు చేశారు. 2022-23 ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని చెరువుల అక్రమణల్లో నేషనల్ గ్రిడ్ లో జరిగిన నివేదిక ప్రకారం హైదరాబాద్ లో అక్రమణకు గురైన 134 చెరువు మీద ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 8,718 నిర్మాణాలు జరగ్గా, బఫర్ జోన్ పరిధిలో 5343 నిర్మాణాలు జరిగినట్టు అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు.
ఈ నివేదిక ప్రకారం మొత్తం 13వేల నిర్మాణాలను కూలగొట్టే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? రాష్ట్రంలోని 14లక్షల ఎకరాల అసైండ్ భూమి, 6లక్షల ఎకరాలు అటవీ భూమి, దేవాదాయ భూములు మొత్తం లక్షల ఎకరాల్లో అన్యాక్రాంతం అయ్యి ఇతరుల చెరలో ఉన్నాయి. ఆ భూములను స్వాధీనం చేసుకునే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.? అని ప్రశ్నించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము