
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను ఎన్నికల ఇన్ చార్జిగా భారతీయ జనతా పార్టీ నియమించింది. దానితో నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించినట్లయింది. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రామ్ మాధవ్ కీలక పాత్ర పోషించారు.
ఆ తరువాత, 2018లో అప్పటి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ప్ఆర్టికల్ 370ని రద్దుచేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలను ప్రతిష్టాకరంగా తీసుకున్న బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకై కసరత్తు చేస్తున్నది.
ఇప్పటికే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ గా నియమించిన బిజెపి తాజాగా రాంమాధవ్ ను కూడా నియమించడంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం అవుతుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ఇద్దరు నేతలను ఎన్నికల ఇంచార్జీలుగా నియమించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికలకు ఒక రాష్ట్రంలో ఒకరికి మించి ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించడం బీజేపీలో అసాధారణం. 2014- 2020 మధ్య కాలంలో బీజేపీ కీలక సంస్థాగత నేతగా ఉన్న మాధవ్ పదేళ్ల క్రితం జమ్మూకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలతో లోతుగా మమేకమయ్యారు. సెప్టెంబర్, 2020లో రామ్ మాధవ్ ను బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు.
అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్న ఆయనను 2021లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో కార్యకారిణి సభ్యునిగా నియమించారు. థింక్ ట్యాంక్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్న ఈశాన్య ప్రాంతంలో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కూడా వ్యవహరించారు.
More Stories
బిహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, 14న కౌంటింగ్
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి యత్నం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి