
కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని స్థాపించడానికి ఎక్కువ సమయం లేదన్న మీడియా ప్రశ్నకు చంపై సోరెన్ ‘అది మీ సమస్య కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఒక రోజులో 30,000 నుంచి 40,000 మంది కార్యకర్తలు చేరుకోగలరు. కొత్త (రాజకీయ) పార్టీని ఏర్పాటు చేయడంలో నాకు ఏ సమస్య ఉంటుంది? వారంలోగా పార్టీని ఏర్పాటు చేస్తా’ అని స్పష్టం చేశారు.
మరోవైపు తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం అంకితం చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని చంపై సోరెన్ ఆరోపించారు. సీఎంగా తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తనకు చెప్పకుండా రద్దు చేయడం చాలా అంసతృప్తిని కలిగించిందని చెప్పారు. తనకు అధికారంపై అత్యాశ లేదని, అందుకే ఆత్మగౌరవం దెబ్బతినే వరకు మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే చాలా అవమానాల తరువాత ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకవలసి వచ్చిందని తెలిపారు. ‘ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని చెప్పారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?