కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన పైశాచిక ఘటనలో బాధితురాలి పోస్ట్‌మార్టం నివేదిక దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలను బయట పెట్టింది. అటాప్సీ నివేదిక ప్రకారం వైద్యురాలిపై లైంగిక దాడి జరిగిందని, ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని రూఢి అయింది. మృతురాలి తల, ముఖం, మెడ, చేతులు, జననేంద్రియంపై 14 గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక తెలిపింది.
‘బాధితురాలి గొంతు నొక్కడంతో ఆమె ఉక్కిరిబిక్కిరయింది. ఈ కారణంగానే మరణించింది. దీనిని హత్యగానే పరిగణించాలి. ఆమెను బలత్కారం చేయడాన్ని బట్టి చూస్తే లైంగిక దాడి జరిగిందనే భావించాలి. జూనియర్ వైద్యురాలి జననేంద్రియంపై తెల్లని, చిక్కటి, జిగట ద్రవం కన్పించింది. బాధితురాలి ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టింది. రక్తస్రావం జరిగింది. శరీరంలో ఫ్రాక్చర్స్ ఏమీ లేవు. రక్త నమూనాలను, శరీరంలోని ఇతర ద్రవాలను మరిన్ని విశ్లేషణల కోసం పంపారు’ అని పోస్ట్‌మార్టం నివేదిక వివరించింది.
ఊపిరాడకు చనిపోయిన కారణంగా అటాప్సీ రిపోర్ట్ లో బాధితురాలి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగినట్టు శరీరమంతా రక్తం గడ్డకట్టినట్టు పేర్కొంది. డాక్టర్ మరణానికి ఊపిరి ఆడక పోవడమే కారణమని వెల్లడించింది. వైద్యురాలు గొంతు నులమడం వల్ల చనిపోయి ఉండవచ్చని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఇదే అదేవిధంగా మృతురాలి శరీరం పైన 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోస్ట్ మార్టం నివేదిక పేర్కొంది.
బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని, మృతదేహంపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. అయితే అదేమిటి అన్నది ఈ రిపోర్టులో వెల్లడించలేదు. ఇక మృతదేహంలో పలు ఎముకలు విరిగాయని ఆరోపణలను పోస్టుమార్టం నివేదిక తోసిపుచ్చింది.
డైరీలో చిరిగిన పేజీ?
తన కుమార్తె వ్యక్తిగత విషయాలను ప్రతి రోజూ తన డైరీలో రాసుకునేదని, ఆ పుస్తకం ఎప్పుడూ తన బ్యాగ్‌లోనే వుండేదని కానీ అందులో ఒక పేజీ కొంతమేర చిరిగి వుందని బాధితురాలి తండ్రి మీడియాకు తెలిపారు. తన కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి విషయమూ తమతో పంచుకునేదని చెప్పారు. డైరీలో చిరిగిన పేజీకి సంబంధించి తాను ఫోటో కూడా తీసినట్లు తెలిపారు. అంతకుమించి ఆ పేజీలో గల వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. అందులోని విషయాలు బహిరంగపరచవద్దని సిబిఐ కోరినట్లు తెలిపారు.

More Stories
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్
బీజాపూర్ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు