ప్రముఖ గాయని పీ.సుశీలకు అస్వస్థత

ప్రముఖ గాయని పీ.సుశీలకు అస్వస్థత
ప్రముఖ నేపథ్య గాయని పీ.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్‌లోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని తెలుస్తున్నది. కడుపునొప్పి కారణంగా హాస్పిటల్‌లో చేరినట్లు వైద్యసిబ్బంది వెల్లడించారు.  అది సాధారణ కడుపునొప్పేనని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తెలిపారు. 86 ఏండ్ల సుశీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్య విషయమై సినీవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  పద్మభూషణ్‌ గ్రహీత అయిన సుశీల సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
తెలుగు సినీవినీలాకాశంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషలలో 40 వేలకుపైగా పాటలు పాడారు.   ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరానికి చెందిన పి సుశీల 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు.
తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు. ఉష్రేష్ మన్మాన్ చిత్రంలోని ‘లైక్ పాల్’ అనే పాటకు ఆమె మొదటిసారిగా ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. కాగా, వయోభారంతో గత కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.