
ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తున్నది. ఇందులో 96శాతానికిపైగా కేసులో కేవలం కాంగోలో మాత్రమే గుర్తించారు. మరో వైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్.. మరింత వ్యాప్తి చెందుతున్నది. దాంతో మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో ఎంపాక్స్ రోజురోజుకు విస్తరిస్తున్నది. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి సోకుతున్నది. ఎంపాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని ప్రకటించింది. ఆఫ్రికాఖండంలో ఈ వైరస్‌కు వ్యాక్సిన్ పరిమిత సంఖ్యలో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
ఈ వారంలో ప్రారంభంలో ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రకారం ఎంపాక్స్‌తో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సహాయం కోసం పిలుపునిచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ వైరస్ ఉధృతిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపాక్స్‌పై అందరూ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల్లోనే విస్తరించే ప్రమాదం ఉందని, వివిద దేశాల్లో అనేక రకాలుగా ఎంపాక్స్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అయితే, ఈ ఏడాది 13 దేశాల్లో ఎంపాక్స్ వైరస్ సోకినట్లు ఆఫ్రికా సీడీసీ వెల్లడించింది.
మొత్తం కేసులు, మరణాల్లో 96శాతానికిపైగా కాంగోలోనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే కేసులు 160శాతం, మరణాలు 19శాతం ఎక్కువగా ఉండడం మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు 14వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 524 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగోలో 70శాతం కేసులు 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనే ఉన్నాయని, 85శాతం మరణాల్లో వారే ఉన్నారని ఆఫ్రికా సీడీసీ పేర్కొంది.
దక్షిణాఫ్రికా అంటువ్యాధుల నిపుణుడు సలీం అబ్దుల్ కరీమ్ మాట్లాడుతూ తాము ఆఫిక్రా చుట్టుపక్కల ఉన్న పొరుగుదేశాలకు సైతం ఎంపాక్స్ ముప్పు ఉందన్నారు. కాంగాలో వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్‌తో మరనాలు రేటు దాదాపు 3-4శాతం ఉందని చెప్పారు. 2022లో ఎంపాక్స్ 70 కంటే ఎక్కువ దేశాలను ప్రభావితం చేసిన విషయం తెలిసిందే.
కాంగో ఎంపాక్స్ రెస్పాన్స్ కమిటీ కోఆర్డినేటర్ క్రిస్ కాసిటా ఒసాకో మాట్లాడుతూ నాలుగు మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ కావాలని కాంగో అధికారులు కోరారని, ఇందులో ఎక్కువగా 18 సంవత్సరాలలోపు పిల్లలకు వినియోగించనున్నట్లు తెలిపారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి