
ప్రాథమిక సమాచారం ప్రకారం జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహన రాందాసు, వెంకటసీతామహాలక్ష్మీ, గ్రామ సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తాసీల్దార్ విజయ్‌కుమార్, విజయవాడ రూరల్ తాసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు.
నిందితుల్లో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయంతోనే వీరంతా కలిసి అగ్రిగోల్డ్ భూముల్ని కొట్టేయడానికి సహకరించినట్టు సిఐడి గుర్తించింది. లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమానికి తెరతీశారు. ఈ దందాలో మండల సర్వేయర్ రమేష్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు.
ఖాతాదారుల్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ డిపాజిట్ల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు సాగుతుండగానే జప్తు చేసిన భూముల్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో దాదాపు 3వేల గజాల భూమిని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి తనయుడి పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు.
ఖాతాదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో 2015 నుంచి కేసులు నమోదు అవుతున్నాయి. నాలుగైదు రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ వ్యవస్థాపకులు సంపాదించిన స్థిర, చరాస్తుల్ని సిఐడి జప్తు చేసింది. అగ్రిగోల్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న భూముల్ని సిఐడి జప్తు చేసింది.
అలాంటి భూముల్లో విజయవాడ రూరల్ మండలం సర్వే నంబర్ 87లో ఉన్న 3వేల గజాల భూమి కూడా ఉంది. అగ్రిగోల్డ్ వ్యవస్థాపకుడు అవ్వా రామారావు తండ్రి అప్పారావు పేరిట ఈ భూమిని 2002లో కొనుగోలు చేశారు. ఆయన తన మనుమళ్ల పేరిట ఆ భూమిని రిజిస్టర్ చేశారు. 2005లో సర్వే నంబర్ 88 పేరుతో 3వేల గజాల భూమిని ఒకరు రిజిస్ట్రేషన్ జరగ్గా దానిని మాజీ మంత్రి కుమారుడు కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ క్రమంలో అవ్వా అప్పారావుకు చెందిన 3వేల గజాల భూమినే తమ భూమి పేర్కొంటూ ఫెన్సింగ్ వేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు