
`న్యాయవ్యవస్థ తిరుగుబాటు’ చేస్తుందనే భయంతో విద్యార్థులు హైకోర్టు ముట్టడికి పిలుపు ఇవ్వడంతో పాటు రాజీనామా చేయాలని అల్టిమేటం ఇవ్వడంతో బాంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ రాజీనామాకు సిద్ధమయ్యారు. శనివారం ఉదయం రాజధాని ఢాకాలోని హైకోర్టు భవనం వెలుపల విద్యార్థులు నిరసన చేపట్టారు.
ప్రధాన న్యాయమూర్తితోపాటు, అప్పిలేట్ విభాగానికి చెందిన ఏడుగురు న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కోర్టు ఆవరణ చుట్టూ సైన్యం బలగాలు మోహరించినట్లు మీడియా తెలిపింది.
కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్‌కోర్టు సమావేశంకు పిలవడంతో నిరసనలు చెలరేగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు ఎలా నడుచుకోవాలో, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి, అదే సమయంలో, నిరసనకారుల నుండి అలా చేయాలనే అల్టిమేటం తర్వాత “సూత్రప్రాయంగా” తన పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
చీఫ్ జస్టిస్‌తో పాటు అపిల్లేట్ డివిజన్ జడ్జీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజీనామా చేయాలని విద్యార్థులు హెచ్చరించారు. ఒకవేళ తప్పుకోని పక్షంలో.. వారి ఇండ్లపై దాడులు చేయనున్నట్లు విద్యార్థులు బెదిరించారు. యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ కు చెందిన కోఆర్డినేటర్ హస్నత్ అబ్దుల్లా ఈ అల్టిమేటమ్ జారీ చేశాడు.
అయితే జడ్జీల భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తన పోస్టుకు రాజీనామా చేయనున్నట్లు చీఫ్ జస్టిస్ ఇవాళ జర్నలిస్టులకు తెలిపారు. రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాల్టీలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నామని, దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్‌కు రాజీనామా లేఖను పంపనున్నట్లు ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్ కొత్తగా నియమించబడిన యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ సలహాదారు, ఆసిఫ్ మహమూద్ కూడా హసన్ రాజీనామాకు అల్టిమేటం ఇచ్చారు. చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ తన రాజీనామాను ప్రకటించిన తర్వాత ఆర్మీ సిబ్బంది నిరసనకారులందరినీ హైకోర్టు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలని అభ్యర్థించారు.
మరోవంక, బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్ కూడా రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంక్‌కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి