పులిచింతల ప్రాజెక్టులో ఏర్పడిన సాంకేతిక సమస్యతో వరద ప్రవాహాన్ని గుర్తించడంలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ అధికారులు విజయవాడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వరద హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు మంగళవారం రాత్రి నుంచి కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పులిచింతల నుంచి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.
ప్రకాశం బ్యారేజి కి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు అధికంగా వస్తున్న కారణంగా కృష్ణానది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. పులిచింతల ప్రాజెక్ట్‌లో ఏర్పడిన సాంకేతిక ప్రమాం కారణంగా వరద నీరు ప్రకాశం బ్యారేజికి వచ్చే అవకాశం ఉందని నది పరివాహక లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వరదలు హెచ్చరిక నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలు ఎదుర్కొనుచున్న వివిధ సమస్యలను అధికారులకు తెలియజేసి యుద్దప్రాతిపధికన వాటిని పరిష్కరించుకొనుటకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యాన చంద్ర తెలియజేసారు. 3 షిఫ్ట్ లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కమిషనర్ వివరించారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన