
ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్‌లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు, యువకులను హిజ్బుల్లా గ్రూప్ చంపినట్లు ఇజ్రాయెల్ ఆరోపించిన విషయం తెలిసిందే.
అనంతరం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూప్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య లెబనాన్‌లోని భారతీయులు ‘జాగ్రత్తగా’ ఉండాలి అని సూచించింది. బీరుట్‌లోని ఎంబసీతో టచ్‌లో ఉండాలని కోరింది. లెబనాన్‌కు వెళ్లాలనుకునే, అక్కడి ప్రవాస భారతీయులు ఎంబసీని సంప్రదించాలంటూ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా డ్రోన్లు కూల్చేసిన పోలాండ్