
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. వచ్చే నెల 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. దీంతో రష్యాతో యుద్ధం తర్వాత ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే ఈ పర్యటనకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇంకా స్పష్టతనివ్వలేదు.
గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై చర్చించారు. కాగా, మోదీ ఈ నెల 8న రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళ్తుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
జూన్ 8న రష్యాలో పర్యటించిన ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పుతిన్ అందజేశారు. ఇండియా- రష్యా 22వ వార్షిక సమావేశం సందర్భంగా ప్రధానిని రష్యాలో పర్యటించాలని పుతిన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కాగా, ఉక్రెయిన్‌పై 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య ప్రారంభించింది. మూడు వారాల్లో ఆ దేశంలోని అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించుకోవాలని పుతిన్ సైన్యం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతుతో మూడు వారాలు అనుకున్న యుద్ధం రెండున్నర ఏండ్లుగా కొనసాగుతూనే ఉన్నది.
ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని, చర్చల తోనే శాంతి నెలకొంటుందని రష్యా, ఉక్రెయిన్‌కు ప్రధాని మోదీ పలుమార్లు సూచించారు.
More Stories
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా
బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా ప్రకటించే అభ్యర్థనకు అమెరికా వీటో
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం