
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సింగరేణి బలోపేతానికి మద్దతు ఇస్తుందని చెబుతూ కేంద్రం నుంచి అందాల్సిన సహకారంతో పాటు సంస్థలోని ఉద్యోగుల సంక్షేమానికి నిబద్ధతతో ఉంటుందని పునరుద్ఘాటించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఒడిశా ప్రభుత్వంతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించామని చెప్పారు. సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్‌బ్లాక్‌లో ఇటీవలనే మరో ముందడుగు పడింది. కీలకమైన అటవీ భూమిని ఒడిశా ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించింది. నిజానికి నైనీ కోల్‌బ్లాక్‌ను 2015లోనే సింగరేణి దక్కించుకుంది. ఈ బ్లాక్‌కు అన్ని రకాల అనుమతులు రావడంతో రానున్న మూడు నెలల్లో ఈ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి భావిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ కోసం 783 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించాలని సింగరేణి కోరింది. కానీ ఇటీవలే 643 హెక్టార్ల భూమిని ఒడిశా ప్రభుత్వం సింగరేణికి బదలాయించింది. 2015లో సింగరేణికి ఈ బ్లాక్‌ను కేటాయించనప్పటికీ భూ బదలాయి సమస్యతో అడుగు ముందుకు పడలేదు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?