
* కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్
కేంద్ర వార్షిక బడ్జ్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో అర్బన్ హౌసింగ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని తెలిపారు. ఇక గ్రామీణ అభివృద్ధికి రూ.2.26 లక్షల కోట్లు కేటాయించారు. ముద్రా రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు.
వచ్చే ఐదేళ్లలో దేశంలోని 30 లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాల్లో 100 వారాంతపు అంగడ్లు (హాట్స్) నిర్మించేందుకు అవసరమైన మద్దతును ప్రత్యేక స్కీమ్ ద్వారా అందిస్తామని నిర్మల చెప్పారు. రుణ మంజూరు వ్యవస్థలు, ఎంఎస్ఎంఈ సర్వీసుల వంటి మొత్తం 7 విభాగాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రా అప్లికేషన్లను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. మహిళల పేరు మీద కొనే ఆస్తులపై పన్ను తగ్గిస్తామని పేర్కొన్నారు.
“రానున్న ఐదేళ్లలో దేశంలో మౌలిక వసతుల కల్పనకు మేం భారీగా కేటాయింపులు జరుపుతున్నాం. మూలధన వ్యయం కోసం ఈ ఏడాది 11.11 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాం. ఇది దేశ జీడీపీలో 3.4 శాతం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు జరపాలని మేం ప్రోత్సహిస్తున్నాము. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, విధానాలు, నిబంధనలు సరళతరం చేయడం ద్వారా మౌలిక సదుపాయాలపై ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం” అని నిర్మల సీతారామన్ వెల్లడించారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి
అదేవిధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తాము ఆర్థిక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎగుమతులు, ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించారు.అంతేగాక దేశంలోని వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తున్నదని వెల్లడించారు.
వచ్చే ఐదేళ్లలో 4.1కోట్లమంది యువతకు ఉపాధి కల్పించేందుకు రూ. 2లక్షల కోట్లు కేటాస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కేంద్రప్రాయోజిత పథకం ద్వారా 20లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.
కోటిమందికి 500 కంపెనీల్లో ఇన్‌టర్న్‌షిప్ అవకాశాలు
ఐదేళ్లలో కోటి మంది యువతకు 500 కంపెనీల్లో ఇన్‌టర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దీనివల్ల నైపుణ్యం పెరుగుతుందని, ఇన్‌టర్న్‌షిప్ చేసేవారికే నెలకు రూ. 5వేల భృతి చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నతవిద్య కోసం రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏటా లక్షలమంది విద్యార్థులకు 3శాతం వడ్డీతో ఈ-ఓచర్స్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
అన్నిరంగాల్లో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ఒక నెల వేతనం 3 వాయిదాల్లో ఇస్తామని ప్రకటించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా గరిష్ఠంగా రూ.15వేలు చెల్లించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అది కూడా నెలకు రూ. లక్ష లోపు వేతనం ఉన్న వారికే అని తెలిపారు. దీనివల్ల 210లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.
ఉత్పత్తి రంగంలో ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుందని చెప్పారు. మొదటిసారి ఉపాధి పొందిన ఉద్యోగులను లింక్ చేస్తుందని, ప్రత్యేక పథకం ద్వారా ప్రోత్సాహకాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తొలి నాలుగేళ్ల ఉద్యోగకాలంలో యజమాని, ఉద్యోగికి ఈపీఎఫ్ చందా ద్వారా నేరుగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగాలు పొందిన 30లక్షల మంది యువతకు ప్రయోజనం కలగనుందని వివరించారు నిర్మల.
బీహార్ కు రూ 50 వేల కోట్ల అదనపు నిధులు
అదేవిధంగా, బిహార్‌కు రూ.50 వేల కోట్లకుపైగా అదనంగా నిధులు కేటాయించారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులకు భారీగా నిధులు కేటాయించారు. పట్నా-పూర్ణియా, బక్సార్-భాగల్పూర్, బోధ్‌గయ, రాజ్‌గిర్, వైశాలి, దర్భాంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపట్టనున్నారు. రోడ్ల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించగా.. ఏటా వరదలతో నష్టపోతున్న బిహార్‌కు వరద నివారణ సాగు కార్యక్రమాల కోసం మరో రూ.11 వేల కోట్లు కేటాయించారు.
కాశీ తరహాలో గయ, బుద్ద గయ టెంపుల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. గంగానదిపై రూ.2,600 కోట్ల మరో రెండు వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. భాగల్పూర్‌లోని పిర్‌పైంతిలో 2,400 మెగా వాట్ల సామర్ధ్యంతో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు అందజేయనున్నట్టు ప్రకటించారు.
More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?