ఉత్తమ నటుడిగా రానా ద‌గ్గుబాటి

ఉత్తమ నటుడిగా రానా ద‌గ్గుబాటి
టాలీవుడ్ నటుడు రానా ద‌గ్గుబాటి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డును అందుకున్నాడు. ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్ సిరీస్ రానా నాయుడు గాను ఈ అవార్డును అందుకున్నాడు. ఇండియ‌న్ బుల్లితెర‌ న‌టులు ప్రతిష్టాత్మకమైనదిగా భావించే ఇండియన్‌ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక  అట్టహాసంగా జ‌రిగింది.  ఈ వేడుక‌లో ఉత్తమ నటుడి విభాగంలో రానా అవార్డును గెలుచుకున్నారు.
అయితే ఈ వేడుక‌కు రానా హాజరు కాక‌పోవడంతో ఆయన తరఫున ఈ అవార్డును సిరీస్ ద‌ర్శ‌కుడు క‌ర‌న్ హ‌న్షుమాన్ అందుకున్నాడు.  టాలీవుడ్ హీరోలు ద‌గ్గుబాటి వెంక‌టేశ్, రానా  కాంబోలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు. 
 

అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ తెలుగు, త‌మిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల‌య్యి మంచి రికార్డు వ్యూస్ సాధించింది. ఈ సిరీస్‌లో తండ్రీ కొడుకులుగా నాగానాయుడు (వెంకటేశ్‌), రానా నాయుడు (రానా) మధ్య నడిచే ట్రాక్‌లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు పక్కన పెడితే.. మిగిలిన ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.సుపర్న్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ డైరెక్ట్‌ చేసిన రానా నాయుడులో సుచిత్ర పిళ్లై, గౌరవ్‌ చోప్రా, సుర్వీన్‌ చావ్లా, ప్రియా బెనర్జీ, ఆదిత్యా మీనన్‌, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, మిలింద్‌ పాఠక్‌, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సిరీస్‌కు సీజ‌న్ 2 కూడా రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే రానా నాయుడు సీజన్‌ 2 గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. 

బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది.. అంటూ రిలీజ్‌ చేసిన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందో తెలియజేసే అప్‌డేట్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం మార్చి 25న షూటింగ్ షురూ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఉండబోతుందట.