
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పట్టాభిషేకం జరిగి 360 ఏళ్లు అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులోభాగంగా లండన్ మ్యూజియంలోని శివాజీ వాఘ్ నఖాను భారత్‌కు తీసుకురావాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
అందుకోసం గతేడాదిలో లండన్‌లోని విక్టోరియా, అల్బర్ట్ మ్యూజియం అధికారులతో సంప్రదింపులు జరిపామని, ఆ క్రమంలో మ్యూజియం అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఓ అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పారు. అలా.. శివాజీ మహారాజు ఉపయోగించిన వాఘ్ నఖా భారత్‌కు వచ్చిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో జులై 19వ తేదీ నుంచి ప్రజల కోసం సతారా మ్యూజియంలో వాఘ్ నఖాను ఉంచుతామని ఆయన వెల్లడించారు. అయితే వాఘ్ నఖాను ప్రతి జిల్లాలో ప్రజల సందర్శన కోసం ఉంచడం కుదరదని తెలిపారు. దీంతో ఈ వాఘ్ నఖాను ఒక ప్రదేశంలో ఉంచితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీనిని చూసేందుకు వస్తారన్నారు.
ఇంకోవైపు వాఘ్ నఖాను సతారాలోనే ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణముందని చెప్పారు. 1659లో సతారాలోని ప్రతాప్‌గఢ్ కోట వద్ద బిజాపూర్ సుల్తాన్ అఫ్జల్ ఖాన్‌ను ఛత్రపతి శివాజీ వాఘ్ నఖాతో చంపారని, అయితే అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించడం అంత మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఇవి విశ్వాసానికి ప్రతీక అని మంత్రి సుధీర్ అభివర్ణించారు. అదీకాక ప్రతాప్‌గఢ్ కోట శివాజీ ధైర్య సాహసాలకు ప్రతీక అని చెప్పారు. దీంతో ఈ వాఘ్ నఖా ప్రదర్శనకు సతారా మ్యూజియంను ఏంచుకున్నామని మంత్రి సుధీర్ వివరించారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం