ఫిల్మ్‌ ఫేర్‌లో ‘ఆర్ఆర్ఆర్’కు ఉత్తమ చిత్రంతో పాటు 8 అవార్డులు

ఫిల్మ్‌ ఫేర్‌లో ‘ఆర్ఆర్ఆర్’కు ఉత్తమ చిత్రంతో పాటు 8 అవార్డులు
టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ 2023 జాబితా విడుదలైంది. 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు కేట‌గిరితో పాటు మొత్తం 8 అవార్డుల‌ను సోంతం చేసుకుంది. ఇక ఉత్త‌మ న‌టిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.

తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోగా, ఉత్తమ డైరెక్టర్​గా ఎస్‌.ఎస్‌.రాజమౌళి పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని తమ నటనకుగానూ జూనియర్ ఎన్​టీఆర్, రామ్‌చరణ్‌లను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది.  ‘నాటు నాటు’కుగానూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్​, కొమురం భీముడో సాంగ్ పాడినందుకు యంగ్ సింగర్ కాలభైరవ, అలాగే ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ లిస్ట్​లో ‘ఆర్​ఆర్​ఆర్’ అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ చేసినందుకు సాబు శిరిల్​ను ఫిల్మ్​ఫేర్ వరించింది.

మరోవైపు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన క్లాసికల్ హిట్ ‘సీతారామం’ మూవీకి కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ నటడు క్రిటిక్స్, ఉత్తమ నటి క్రిటిక్స్​, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ ఇలా ఈ మూవీ ఏకంగా ఐదు అవార్డులు దక్కించుకుంది. ముఖ్యంగా ‘కానున్న కల్యాణం’ సాంగ్​కు చక్కటి సాహిత్యాన్ని అందించినందుకు దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రీకి అవార్డు వచ్చింది. ఇక పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్​’, సాయిపల్లవి ‘విరాటపర్వం’ కూడా ఫిల్మ్​ఫేర్​లో పురస్కారాలు అందుకున్నాయి.

ఫిల్మ్‌ఫేర్‌-2023 విజేతలు వీళ్లే

ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) – సీతారామం
ఉత్త‌మ న‌టుడు – (రామ్ చ‌ర‌ణ్- ఎన్టీఆర్)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – రాజ‌మౌళి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) – దుల్కర్‌ సల్మాన్‌
ఉత్తమ నటి – మృణాళ్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) -సాయి పల్లవి( విరాట్‌ పర్వం)
ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి – నందితాదాస్‌ (విరాట్‌ పర్వం)
ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు.. ఆర్‌ఆర్ఆర్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – సాబు శిరిల్‌ (ఆర్ఆర్‌ఆర్‌)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ – ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ నేపథ్య గాయని – చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)