
పేపర్ లీక్, ఒఎంఆర్ షీట్‌లకు సంబంధించిన అక్రమాలు గురువారం విచారణ సందర్భంగా ఐఐటీ మద్రాస్ నివేదికలోని ఫలితాలపై ఆధారపడతామని కూడా ఎన్టీఏ కోర్టుకు తెలిపింది. మే 4న టెలిగ్రామ్‌లో లీక్ అయిన నీట్ -యూజీ పరీక్ష పేపర్ ఫోటోను చూపించే వీడియో నకిలీదని ఏజెన్సీ పేర్కొంది.
‘టెలిగ్రామ్ ఛానెల్‌లోని చర్చలు సభ్యులు వీడియోను నకిలీగా గుర్తించారని సూచిస్తున్నాయి. లీక్ గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించడానికి టైమ్‌స్టాంప్ మార్చారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, చర్చలు వీడియోలోని చిత్రాలు మార్చారు. తేదీని ఉద్దేశపూర్వకంగా సవరించారు. స్క్రీన్‌షాట్‌లు వీడియోలో చేసిన క్లెయిమ్‌ల కల్పితంగా ఉన్నాయి.’ అని అఫిడవిట్ పేర్కొంది.
అధిక మార్కుల అనేవి వివిధ నగరాలు, కేంద్రాలలో స్థిరంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ‘సామూహిక అక్రమాలకు సంబంధించిన సూచనలేవీ లేవని లేదా అభ్యర్థులకు అసహజ స్కోర్‌లకు దారితీసే లబ్ది చేకూర్చడం లేదని విశ్లేషణ చూపిస్తుంది. విద్యార్థులు పొందిన మార్కులలో మొత్తం పెరుగుదల ఉంది. ఈ పెరుగుదల నగరాలు, కేంద్రాలలో కనిపిస్తుంది’ అని తెలిపింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్ సమర్పించారు. అలాగే నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భవిష్యత్తులో అలాంటి లీక్‌లు జరగకుండా లేవనెత్తిన సమస్యలను పరిగణనలోకి తీసుకునేందుకు 7 మంది సభ్యుల నిపుణుల ప్యానెల్‌ను కేంద్రం ప్రతిపాదించింది
ఈ క్రమంలో జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఎవరైనా అభ్యర్థి ఏదైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే, కౌన్సెలింగ్ ప్రక్రియ సమయంలో లేదా తర్వాత కూడా అటువంటి ఆ వ్యక్తి కౌన్సెలింగ్ ఏ దశలోనైనా రద్దు చేయబడుతుంది. ‘నిరాధారమైన ఆందోళనల’ ఆధారంగా 23 లక్షల మంది అభ్యర్థులపై మళ్లీ పరీక్షల భారం పడకుండా చూస్తామని కేంద్రం తెలిపింది. అన్యాయమైన ప్రయోజనం పొందడంలో దోషిగా తేలిన అభ్యర్థులెవరూ ఎలాంటి ప్రయోజనం పొందకుండా చూస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ