
ఇక ఉండేందుకు ఇల్లు లేక ఫుట్‌పాత్‌లపైనే కాలం వెళ్లదీసే నిరాశ్రయుల పరిస్థితి గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 11 నుంచి జూన్ 19వ తేదీ వరకూ తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ కారణంగానే వీరంతా మరణించారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ పేర్కొంది.
ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. ‘జూన్ 11 నుంచి 19వ తేదీ వరకూ తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణించారు’ అని తెలిపారు.
కాగా గత ఐదేళ్లలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే అని ఎన్జీవో తెలిపింది. 2019 జూన్ 11 నుంచి 19 వరకూ 143 మంది, 2020లో జూన్ 11 నుంచి 19 వరకూ 124 మంది, 2021లో జూన్ 11 నుంచి 19 వరకూ 58 మంది, 2022లో జూన్ 11 నుంచి 19 వరకూ 150 మంది, 2023 జూన్ 11 నుంచి 19 వరకూ 75 మంది నిరాశ్రయులు వడదెబ్బ కారణంగా మరణించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మాత్రం ఏకంగా 192 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ