తమిళనాడులో కల్తీ మద్యానికి 29 మంది బలి

తమిళనాడులో కల్తీ మద్యానికి 29 మంది బలి
తమిళనాడులో కల్తీ మద్యానికి పది మంది బలయ్యారు. కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన మరో 60 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మెరుగైన చికిత్స కోసం వారిని పుదుచ్చేరిలోని జిప్మర్‌ దవాఖానకు తరలించారు.  18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించింది.
ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై సీబీ- సీఐడీ విచారణకు స్టాలిన్‌ ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ జతావత్‌పై బదిలీ వేటు వేశారు. 
 
కళ్లకురిచ్చి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎంఎస్‌ ప్రశాంత్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే కళ్లకురిచ్చి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. వీరితోపాటు మరో 9 మందిని కూడా సస్పెండ్‌ చేశారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు, పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించారు.
‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం’ అని ఎక్స్‌లో వేదికగా సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.
 
తమిళనాడు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, తాము 200 లీటర్ల అరక్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో ”మిథనాల్” మిశ్రమం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం అరకిలో తిన్న బాధితులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతూ జూన్ 19న కాళ్లకురిచ్చి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు.
 
వార్తా కథనాలను ఉటంకిస్తూ, ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి మాట్లాడుతూ, కల్తీ అరక్ తాగి సుమారు 40 మంది ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు. డీఎంకే అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ అరక్‌ల వినియోగం వల్ల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని, ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో కూడా లేవనెత్తుతూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.