
ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 23 జాతీయ భాషలు, 31 మండలికాలు అన్ని కేంద్రాల ద్వారా ఆకాశవాణి ప్రసారం చేస్తుంది. అలాగే ఇంగ్లీష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటినుంచి 2022 అక్టోబర్ వరకు మన్ కీ బాత్ ద్వారా ప్రసార భారతికి రూ. 33.16 కోట్ల ఆదాయం వచ్చింది.
2023 ఏప్రిల్ 30వ తేదీతో మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సామాన్యులతో అనుసంధానానికి, ప్రజల్లోని భావ తీగలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమం కొన్ని నెలల పాటు తాత్కాలికంగా వాయిదా పడిందని, మళ్లీ ప్రారంభం కానుందని చెప్పడం సంతోషంగా ఉందని ప్రధాని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. mygov ఓపెన్ ఫోరమ్, namo యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నెంబర్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సూచించారు.
ఈ నెలవారీ రేడియో కార్యక్రమం ఈ 111వ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఎందుకంటే ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది మొదటి ఎపిసోడ్. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా, ఈ నెలవారీ కార్యక్రమం మూడు నెలలుగా ప్రసారం కావడం లేదు. 11వ ఎపిసోడ్ ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రధాని మూడవసారి ఎన్డీయేకు మెజారిటీని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలను పంచుకోవచ్చు.
More Stories
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్
‘ఐ లవ్ ముహమ్మద్’ పోస్టర్లు కాదు, శాంతిభద్రతల సమస్య
ఛత్ పండుగ తర్వాతే బిహార్ ఎన్నికలు