
ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో బుధవారమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నూతన ప్రభుత్వాలు కొలువు తీరాయి. అయితే ఈ పొరుగు రాస్త్రాలలో ప్రతిపక్ష నేతలు స్పందించిన తీరు పూర్తిగా భిన్నంగా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాధారణంగా ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానం అందజేస్తారు. అయితే తానే స్వయంగా ఆహ్వానించాలని భావించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జెపి నడ్డా, నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులతో పాటుగా జగన్ కు కూడా ఫోన్ చేశారు. అయితే వారందరిలో కేవలం జగన్ మాత్రమే ఫోన్ కు అందుబాటులోకి రాలేదు.
చంద్రబాబుతో మాట్లాడటం ఇష్టం లేక ఆయన ఆ ఫోన్ ను నిరాకరించిన్నచిన్నట్లు తెలుస్తున్నది. చంద్రబాబు ప్రమాణస్వీకారంకు హాజరు అయ్యేందుకు జగన్ కు ఇష్టం లేకపోవచ్చు. ఫోన్ చేసిన్నప్పుడు మర్యాదగా మాట్లాడి, శుభాకాంక్షలు చెబితే సరిపోయెడిది. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలపలేదు.
కానీ, అదేరోజు సాయంత్రం భువనేశ్వర్ లో జరిగిన ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వరుసగా పనిచేసిన బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ స్వయంగా హాజరయ్యారు. ప్రధాని, ఇతర బిజెపి నాయకులతో కలసి వేదికను పంచుకొని నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు.
ప్రమాణస్వీకారోత్సవం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ నేరుగా నవీన్ పట్నాయక్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి కాసేపు ముచ్చటించారు. తర్వాత సీఎం సహా మంత్రులందరూ నవీన్ పట్నాయక్‌తో కరచాలనం చేశారు. అయితే, ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్‌లో కనిపించకపోవడం గమనార్హం. నవ్యాంధ్రకు తొలి సీఎంగా 2014లో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసినప్పుడు సహితం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకాలేదు. అలాగే, 2019లో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి చంద్రబాబు రాలేదు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి