
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది టీమిండియా. వరుసగా మూడో విజయంతో దుమ్మురేపింది. దీంతో గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు భారత్ చేరింది. న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన ప్రపంచకప్ గ్రూప్-ఏ మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య అమెరికా జట్టుపై విజయం సాధించింది.
నిలిచి గెలిపించిన సూర్య, దూబే
రిషబ్ పంత్ (20 బంతుల్లో 20 పరుగులు) కాసేపు నిలకడగా ఆడాడు. అయితే, అలీ ఖాన్ వేసిన ఎనిమదో ఓవర్లో సరిగా బౌన్స్ కాని బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 44 పరుగుల వద్ద మూడో వికెట్ చేజారింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే నిలకడగా ఆడి పరుగులు రాబట్టారు. పిచ్ కఠినంగానే ఉన్నా నిలిచారు. అమెరికా బౌలర్లు కూడా కట్టదిట్టంగా బౌలింగ్ చేశారు.
అయితే, సూర్య, దూబే క్రమంగా పరుగులు చేస్తూ లక్ష్యం దిశగా ముందుకు సాగారు. అయితే, 15వ ఓవర్ తర్వాత సూర్య, దూబే దూకుడుగా ఆడారు. లక్ష్యాన్ని కరిగించేశారు. 49 బంతుల్లో అర్ధ శతకానికి చేరాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య, దూబే అజేయంగా 67 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మొత్తంగా 18.2 ఓవర్లలోనే టీమిండియా గెలిచింది.
అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది అమెరికా. భారత పేసర్ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి అమెరికాను ఆరంభంలోనే దెబ్బ తీశాడు. మొత్తంగా అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. అమెరికా బ్యాటర్లలో నితీశ్ కుమార్ (27), స్టీవెన్ టేలర్ (24) పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు ఎక్కువ సేపు నిలువలేకపోయారు.
భారత బౌలర్లలో అర్షదీప్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‍లో రవీంద్ర జడేజాకు బౌలింగే ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. ప్రపంచకప్‍లో తదుపరి గ్రూప్ దశలో కెనడాతో జూన్ 15న మ్యాచ్ ఆడనుంది భారత్. న్యూయార్క్‌లో తొలి మూడు మ్యాచ్‍లు ఆడిన టీమిండియా.. కెనడాతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది.
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా తొలి రెండు మ్యాచ్‍లు గెలిచి సత్తాచాటింది. పాకిస్తాన్ కు కూడా షాకిచ్చి అదరగొట్టింది. అయితే, భారత్‍తో ఈ మ్యాచ్‍కు గాయం వల్ల రెగ్యులర్ కెప్టెన్ మెనాంక్ పటేల్ దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‍లో అమెరికా టీమ్‍కు కెప్టెన్సీ చేశాడు ఆరోన్ జోన్స్. గ్రూప్ దశలో అమెరికాకు ఐర్లాండ్‍తో మ్యాచ్ మిగిలి ఉంది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి