భారత ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 8న మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కొత్త మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన నేతగా మోదీ నిలువనున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జూన్ 5న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 17వ లోక్ సభను రద్దు చేయాలని సిఫారసు చేసింది.
17వ లోక్ సభ కాలపరిమితి జూన్ 16వ తేదీ వరకు ఉంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై మంత్రులతో ఆయన చర్చించారు. ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 17వ లోక్‌సభకు రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేయడంతో 18వ లోక్‌సభ ఏర్పాటుకు, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టాడానికి మార్గం సుగమమవుతుంది.
నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు.
ఎన్డీయే లో ప్రస్తుతం కీలకంగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్ లు తాము ఎన్డీయేలోనే కొనసాగుతామని బీజేపీ అగ్ర నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగే ఎన్డీయే సమావేశంలో ఈ రెండు పార్టీలు బీజేపీకి అధికారికంగా మద్దతు లేఖలను సమర్పించే అవకాశం ఉంది. దాంతో, మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. జూన్ 8 న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ మెజారిటీని దాటలేకపోయినప్పటికీ పొత్తుల సాయంతో ఎన్డీయే కూటమి 292 సీట్లు సాధించింది. విపక్ష ఇండియా కూటమి సంఖ్య 234 గా ఉంది. 2019లో గెలిచిన 303 సీట్లు, 2014లో గెలిచిన 282 స్థానాలతో పోలిస్తే. 2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి బలం చాలా తగ్గింది.
మరోవైపు, 2019లో 52, 2014లో 44 సీట్లతో పోలిస్తే 99 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ బాగా బలపడింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272 మెజారిటీ మార్కుకు 32 స్థానాలు తక్కువ స్థానాలు సంపాదించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్