
ఒడిశా సిఎం చేతి కదలికలను కూడా పాండియన్ నియంత్రిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించిన మరునాడు పట్నాయక్ ఆరోగ్య స్థితిపై ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు. ఒక సమావేశంలో ఉపన్యాసం ఇస్తుండగా పట్నాయక్ చేయి వణుకుతుండగా దానిని ఒక బల్లపై పాండియన్ ఉంచడాన్ని చూపుతున్న ఒక వీడియోను హిమంత శర్మ ’ఎక్స్’ పోస్ట్‌లో పంచుకుంటూ, ‘ఇది చాలా బాధపెట్టే వీడియో. నవీన్ బాబు చేతి కదలికలను సైతం వికె పాండియన్ నియంత్రిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఓబీసీ హక్కులను ముస్లింలకు
బంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం నకిలీ కుల ధ్రువీకరణపత్రాల ద్వారా అసలైన ఓబీసీ హక్కులను ముస్లింలకు కట్టబెడుతోందని ప్రధాన మంత్రిమోదీ ఆరోపించారు. వాటిని కలకత్తా హైకోర్టు రద్దు చేసినా, టీఎంసీ ఆ తీర్పును అంగీకరించటం లేదని దుయ్యబట్టారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బంగాల్‌లోని కక్‌ద్వీప్ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఓ వర్గాన్ని బుజ్జగించేందుకు టీఎంసీ ప్రభుత్వం బహిరంగంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా నకిలీ కులధ్రువపత్రాల విషయంలో టీఎంసీ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
“బంగాల్ యువతకు లభించాల్సిన అవకాశాలను చొరబాటుదారులు లాక్కుంటున్నారు. మీ ఆస్తిపాస్తులను వారు కబ్జా చేస్తున్నారు. బంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా లెక్కలు మారిపోవటంపై దేశమంతా చింతిస్తోంది” అని ప్రధాని తెలిపారు.
“ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకించటం, సీఏఏపై అసత్యాలు చెప్పటం సహా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారంటే బంగాల్‌లో చొరబాటుదారులను రక్షించాల్సి ఉంది. హిందూ శరణార్థులు, మథువా శరణార్థులను టీఎంసీ బంగాల్‌లో ఉండనివ్వకూడదని అనుకుంటోంది. కానీ మీరు (హిందూ శరణార్థులు) చింతించవద్దు. జూన్ 4వ తేదీ తర్వాత టీఎంసీ నేతల పని అయిపోతుంది.” అని మోదీ భరోసా ఇచ్చారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా