
భారతీయ ఆర్మీ ఆఫీసర్ రాధికా సేన్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. కాంగోలో యూఎన్ పీస్‌కీపింగ్ మెషీన్‌లో పనిచేసిన ఆమెకు ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును ప్రదానం చేయనున్నారు. యూఎన్ పీస్‌కీపర్‌గా మహిళలు, అమ్మాయిల హక్కుల కోసం ఆమె అసాధారణ పోరాటం చేశారు.
2000 భద్రతా మండలి తీర్మానం ప్రకారం కూడా ఆమెకు గుర్తింపు ఇవ్వనున్నారు. యుద్ధ ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళల్ని రక్షిస్తున్న నేపథ్యంలో ఆర్మీ ఆఫీసర్‌కు అవార్డు అందజేయనున్నారు. యూఎన్ పీస్‌కీపర్స్ ఇంటర్నేషనల్ డే రోజున రాధికా సేన్‌కు అవార్డును ఇవ్వనున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో రాధికా సేన్ జన్మించారు. బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌లో ఆమె కెరీర్ ప్రారంభమైంది. భారతీయ ఆర్మీలో చేరే సమయంలో ఆమె బాంబే ఐఐటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. 2023లో కాంగోలో చేపట్టిన పీస్‌కీపింగ్ మిషన్‌కు ఆమెను నియమించారు. ఎంగేజ్మెంట్ ప్లటూన్ కమాండర్‌గా ఆమె పనిచేశారు. 2024 ఏప్రిల్ వరకు ఇండియన్ రాపిడ్ డెవలప్మెంట్ బెటాలియన్‌లో చేశారు.
మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న రెండో భారతీయ వ్యక్తిగా రాధికా సేన్ నిలిచారు. గతంలో మేజర్ సుమన్ గవాని ఈ అవార్డును అందుకున్నారు. ఆమె దక్షిణ సుడాన్ పీస్ మిషన్‌లో చేశారు. 2019లో ఆమెను సన్మానించారు. యూఎన్ పీస్‌కీపింగ్ ఆపరేషన్స్‌లో సుమారు 6063 మంది భారతీయులు ఉన్నారు.
మోనుస్‌కో మిషన్‌లో 1954 మంది చేశారు. దీంట్లో 32 మంది మహిళలు ఉన్నారు. మహిళ రక్షణ కోసం రాధికా సేన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
లింగ సమానత్వం కోసం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో రాధికా సేన్ పనిచేశారు. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ తరగతులను ఆమె నిర్వహించారు.
లింగ సమానత్వం కోసం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోలో రాధికా సేన్ పనిచేశారు. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ తరగతులను ఆమె నిర్వహించారు.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక