కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లలో కుప్పలుగా నల్లధనం

కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లలో కుప్పలుగా నల్లధనం

కాంగ్రెస్, జేఎంఎం నేతలు తమ ఇళ్లలో నల్లధనాన్ని కుప్పలుగా ఉంచుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. జంషెడ్‌పూర్‌లో ఆదివారం నిర్వ‌హించిన ఎన్నికల బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటూ కాంగ్రెస్, జేఎంఎంలు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, వారు అవినీతి, అబద్ధాల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్, జేఎంఎం వంటి పార్టీలు మన జార్ఖండ్‌ను ప్రతి అవకాశంలోనూ కొల్లగొట్టాయని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతికి తల్లి. కాంగ్రెస్, జేఎంఎం ప్రజలకు అభివృద్ధి ఏ, బీ, సీ, డీ… కూడా తెలియదని, వారి సమస్యలు పేదల ఆస్తులను ఎక్స్‌రే చేయడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కోవడం అంటూ ధ్వజమెత్తారు.

జార్ఖండ్‌లో జేఎంఎం భూ కుంభకోణానికి పాల్పడిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.  పేద గిరిజనుల భూములను లాక్కొని సైన్యం  భూములను లాక్కున్నారని చెబుతూ ఈ నిజాయితీ లేని వ్యక్తుల రహస్య స్థావరాల నుండి మోదీ  డబ్బును రికవరీ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు చేరవేసేందుకు తాము ఈ డబ్బును రికవరీ చేయడం లేదని, ఈ డబ్బు మొత్తం ఎవరికి చెందుతుందో ఆ పేదలకు తిరిగి ఇచ్చే మార్గం కోసం వెతుకుతున్నానని, ఇది మోదీ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ పారిశ్రామికవేత్తలను దేశ శత్రువులుగా పరిగణిస్తోందిని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్, జేఎంఎం లాంటి పార్టీలు దేశంలోని పరిశ్రమల గురించి పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారని తెలిపారు.  వారి అవినీతి, దోపిడీ గురించి వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.  కాంగ్రెస్ యువరాజులు పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను ప్రతిరోజూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ పారిశ్రామికవేత్త తమ రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడి పెడతారు? ఆ రాష్ట్రాల యువత ఏమవుతుంది? అంటూ ప్రధాని ప్రశ్నించారు.

‘యువరాజు మావోయిస్ట్ భాష వాడుతున్నందున’ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో పెట్టుబడులకు ముందు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని తెలిపారు. ‘కాంగ్రెస్ ‘షెహజాదా’ ఉపయోగిస్తున్న భాష ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులకు ముందు 50 సార్లు ఆలోచిస్తారు. మావోయిస్ట్‌లు మాట్లాడే భాషను ‘షెహజాదా’ వాడుతూ, వినూత్న పద్ధతుల ద్వారా డబ్బును లాక్కుంటున్నారు’ అని రాహుల్‌ను దృష్టిలో పెట్టుకుని మోదీ  ఆరోపించారు.

కాంగ్రెస్ లాంటి పార్టీలు మిమ్మల్ని ఏనాడూ పట్టించుకోలేదని ప్రధాని చెప్పారు.  ఇంతమంది 60 ఏళ్లుగా ‘గరీబీ హఠావో’ అనే తప్పుడు నినాదాన్ని ఇవ్వగా, 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి మోదీ బయటికి తీసుకొచ్చారని తెలిపారు.  కాంగ్రెస్ యువరాజు వయనాడ్ నుంచి పారిపోయి రాయ్ బరేలీకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది నా తల్లి సీటు అని అందరికీ చెబుతూ తిరుగుతున్నాడు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వ్యక్తులు పార్లమెంట్ సీట్లకు వీలునామా రాస్తున్నారు. ఇలాంటి కుటుంబ ఆధారిత పార్టీల నుంచి జార్ఖండ్‌ను కాపాడాలని పిలుపిచ్చారు.