
త్రినయని సీరియల్‌తో తెలుగులో విసేసఖంగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ నటి పవిత్ర జయరాం ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి బి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ఆర్టిసి బస్సు ఢీకొనడంతో బుల్లితెర నటి పవిత్ ర(42) చనిపోయారు.
కర్నాటకలోని తన సొంతూరు వెళ్లి హైదరాబాద్‌కు వస్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం ఎదురుగా వస్తున్న ఆర్టిసి బస్సును ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయారు. త్రినయని అనే సీరియల్లో ఆమె మహిళా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమె డ్రైవర్ శ్రీకాంత్, బంధువు ఆపేక్ష, తోటి నటుడు చంద్రకాంత్ కూడా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
పవిత్ర జయరాం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానెల్. ఆమె మృతి తోరని లోటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు” అని ట్వీట్ చేసింది.
కర్ణాకటలో మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్‌తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపటా, రాధారామన్, విద్యావినాయక సహా కన్నడలో పదికిపై పైగా సీరియళ్లు చేశారు. నిన్నే పెళ్లాడతా అనే సీరియల్‌తో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్‌తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు.
త్రినయని సీరియల్ జీ తెలుగు ఛానెల్లో 2020 మార్చిలో ప్రారంభమైంది. సూపర్ నేచురల్ ఫిక్షనల్ సీరియల్‌గా ఉన్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్లను సాధిస్తోంది. బెంగాలీ త్రినయని ఆధారంగా తెలుగులో ఈ సీరియల్ కథను మేకర్స్ రూపొందించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి