
స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ టీమ్ చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి కృష్ణ పలకరించారు. అలాగే ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాంగ్రస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఆయనను పరామర్శించారు. ఆయన త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాదే క్రియాశీల రాజకీయాల నుండి ఎస్ఎం కృష్ణ నిష్క్రమించారు. వయసు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తొంబైల్లో యాభైలా తాను ఉండలేనని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. తన వయసు రీత్యా స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశానని తెలిపారు.
ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులను అనుభవించారు. 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. యుపిఎ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరాను. కొద్ది కాలానికే రాజకీయాల నుండి నిష్క్రమించారు. 1962లో మొదట అసెంబ్లీకి, 1968లో ఆ తర్వాత లోక్ సభకు ఎన్నికయ్యారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?