
‘మాకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో కారులో అపస్మారక స్థితిలో ఉన్న నా కుమార్తెను చూశాను. ఆ కారును గాజా నగరమంతా తిప్పడం కనిపించింది’ అని మృతురాలు షానీ తల్లి వాపోయింది. కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.
గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్ జరిగిన ప్రాంతంలోనే 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 1400 మంది మరణించారు. దాడి అనంతరం హమాస్ మిలిటెంట్లు కొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో 23 ఏళ్ల షానీ లౌక్ కూడా ఒకరు. గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. వేలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న దవాఖానల సమీపంలో వైమానిక దాడులు జరుగుతుండటంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ఇలా ఉండగా, ఇరుపక్షాలు కాల్పులు విరమించాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కోరుతుండగా, కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, హామాస్ విజయం సాధించేవరకు యుద్ధ ఆగదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు.
ఇప్పటిరకు గాజాలో 8300 మంది మరణించారని హమాస్ ప్రకటించింది. కాగా, హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారని, 230కిపైగా మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహూ వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.
More Stories
పాక్- సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ అధ్యయనం
అఫ్గానిస్థాన్ ఉగ్రస్థావరంగా మారకుండా చూడాలి
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్