కేవలం మతం ఆధారంగా హింసను ప్రేరేపించిన దుర్ఘటనపై ప్రపంచంలోని మానవాళి దిగ్భ్రాంతి చెందిందని చెప్పారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ దృక్పథాన్ని స్పష్టం చేశారని చెప్పారు. తెలంగాణ ఉగ్రవాద పీడిత ప్రాంతం అని, అనేక ఘర్షణలతో నష్టపోయిన ప్రాంతమని చెబుతూ ఈ ఉగ్రవాదంపై బిఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరి ఏమిటో తెలపాల్సిందే అని స్పష్టం చేశారు .
ఉగ్రవాదులతో చేతులు కలిపిన చరిత్ర కాంగ్రెస్ ది అంటూ అనేకమార్లు రాజకీయ స్వలాభం కోసం, ఎన్నికల్లో గెలిచేందుకు ఉగ్రమూకలతో చేయి కలిపిందని బీజేపీ నేత ఆరోపించారు. ఉగ్రవాదంపై ఎంఐఎం- కాంగ్రెస్ ప్రకటన ఒకే విధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, ప్రపంచంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తున్నదని తెలిపారు.
కాంగ్రెస్ తెలంగాణలో రాజకీయం చేస్తోంది అంటే కర్ణాటక రిజర్వాయర్ నుంచి డబ్బులు తెచ్చి తెలంగాణలో పంటకు ఖర్చు పెట్టినట్లుగా మారిందని మురళీధరరావు విమర్శించారు. ఇవ్వాళ కర్ణాటక లో దొరికిన డబ్బు తెలంగాణ ఎన్నికల కోసం ఉంచినదే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక నుంచి డబ్బు విచ్చలవిడిగా వస్తోందని చెబుతూ ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’
సెల్, జీన్ థెరపీ రంగంలో భారత్ బయోటెక్
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!