విషమంగా డీ శ్రీనివాస్ ఆరోగ్యం

విషమంగా డీ శ్రీనివాస్ ఆరోగ్యం
మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయి మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన ప్రస్తుతం ఐసీయూలో చికిత్స చికిత్స పొందుతున్నట్లు సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 
 
డీ శ్రీనివాస్ గత కొంత కాలం అనారోగ్యం బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన శ్వాసకోస సంబంధిత సమస్య బాధపడుతున్నారని వైద్యలు తెలిపారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. శ్రీనివాస్ కు ఆస్తమా, కిడ్నీ, బీసీ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తే కానీ డీ శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఓ నిర్ణయానికి రాలేమని సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ తెలిపారు.
 
వయస్సు పెరగడంతో ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. సోమవారం డీ శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లారు. ఒక సమయంలో డీఎస్ కాంగ్రెస్ లో కీలక వ్యక్తిగా పని చేశారు. డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

 
అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డీఎస్ ఇద్దరు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. ఒకనొక సమయంలో డీఎస్ ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. కాని అప్పుడు రాజశేఖర్ రెడ్డినే సీఎం పదవి వరిచింది. 2009 తర్వాత కూడా డీఎస్ సీఎం అవ్వడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.
అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో డీఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత డీఎస్ బీఆర్ఎస్ చేరారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన క్రమంగా రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. డీఎస్ వారసులుగా ఆయన ఇద్దరు కొడుకులు చెరో రాజకీయ పార్టీలో ఉన్నారు. పెద్ద కొడుకు కాంగ్రెస్ లో ఉండగా.. చిన్న కొడుకు అర్వింద్ బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతోన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో డీఎస్ మంచి పట్టునట్లు స్థానికంగా ఉన్న నేతలు చెబుతున్నారు.