ఫస్ట్ తారీఖునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలిస్తాం

ఫస్ట్ తారీఖునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలిస్తాం
 
‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం… 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.  పొరపాటున బీఆర్ఎస్ మరోసారి గెలిస్తే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిస్తారని, మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయిస్తాడని హెచ్చరించారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరుతూ  జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో ఉన్న కేసీఆర్ కు టీచర్ల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు.  కొంపల్లిలో జరుగుతున్న ‘‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’’లో మాట్లాడుతూ  కేబినెట్ మీటింగ్ లో టీచర్ల సమస్యలనే కనీసం ప్రస్తావించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
 
పీఆర్సీ ఊసే లేదని అంటూ కేసీఆర్ కు టీచర్లపట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్ధమైతుంది కాబట్టి కసితో బీఆర్ఎస్ ను ఓడించాలని కోరారు.  నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలిస్ కేసీఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగమని ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదని విమర్శించారు. దళిత బంధు, రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి హామీలు అమలు చేయలేదని గుర్తు చేశారు.
 
బీజేపీ అధికారంలోకి 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తామని వెల్లడించారు.  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.