ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు సిరీస్‌ను ఆసీస్ 20తేడాతో కైవసం చేసుకుని తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. 75.56శాతం విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తర్వాత భారతజట్టు 58.93విజయశాతంతో నిలిచింది.
గణాంకాలపరంగా టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ఆసక్తికరంగా మారింది. భారత్‌తో ఆస్ట్రేలియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడనుంది. స్వదేశంలో భారత జట్టు అజేయంగా కొనసాగుతుంది. దీంతో ఇరు జట్లు సిరీస్ విజేతగా నిలిచేందుకు హోరాహోరీగా పోరాడనున్నాయి. భారత్ మధ్య సిరీస్ ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో జరిగే టెస్టుతో ప్రారంభం కానుంది.
కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కోసం భారత్‌కు శ్రీలంక నుంచి పోటీ ఎదురుకానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో భారత్ తరువాత శ్రీలంక 53.33 విజయశాతంతో తృతీయ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై శ్రీలంక భవితవ్యం ఆధారపడింది. దక్షిణాఫ్రికా 48.72శాతం, ఇంగ్లండ్ 46.97శాతంతో టాప్5లో కొనసాగుతున్నాయి.

More Stories
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా ఔరంగాబాద్