
మునుగోడు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ నిన్నటి నుండి రాజగోపాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో రాజగోపాల్ మంగళవారం ఉపఎన్నిక ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు.
ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి నేడు నాంపల్లి మండలంలో ప్రచారం నిర్వహించాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా ఆ పర్యటను రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గితే బుధవారం నుంచి రాజగోపాల్ రెడ్డి తిరిగి ప్రచారం నిర్వహించే అవకాశముంది.
లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం
చండూరు మండలంలో అభ్యర్థి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుమ్మలపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో చాలా సందర్భాల్లో ప్రభుత్వంపై కొట్లాడారని ఆమె గుర్తు చేశారు.
ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారని, మునుగోడును అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆమె విమర్శించారు. మునుగోడును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆమె చెప్పారు.
తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలంటే రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.
More Stories
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే