
కర్ణాటకలో హిజాబ్‌పై రసభ తెరవరుగవుతుందని అనుకొంటున్న సమయంలో ముఖ్యంగా కోస్తా కర్ణాటకలో, స్థానిక వార్షిక ఉత్సవాల నుండి ముస్లిం దుకాణదారులను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి. ముస్లింల యాజమాన్యంలోని దుకాణాలను జాతరలు మినహాయించాలని హిందూ గ్రూపులు చేసిన ఒత్తిడికి ఈ జాతరల నిర్వాహక కమిటీలు ఆమోదిస్తున్నట్లు తెలుస్తున్నది.
కర్నాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థించిన తర్వాత, చాలా మంది ముస్లిం దుకాణదారులు నిరసనగా షట్టర్లను దించారు. సాధారణంగా ఏప్రిల్-మేలో జరిగే రాష్ట్రంలోని తీర ప్రాంతంలోని దేవాలయాల వార్షిక ఉత్సవాలు కోట్లలో భారీ ఆదాయాన్ని పొందుతాయి.
మతపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, గతంలో ఇటువంటి పండుగలు ఎవ్వరి వ్యాపార అవకాశాలనైనా చాలా అరుదుగా దెబ్బతీశాయి. కానీ హిజాబ్‌పై హైకోర్టు తీర్పుపై ముస్లింలు పిలుపునిచ్చిన బంద్ తర్వాత, ఈ ప్రాంతంలోని అనేక దేవాలయాలు తమ పండుగలలో ముస్లింలకు ప్రవేశాన్ని నిరోధించాయి.
ఏప్రిల్ 20న జరగాల్సిన మహాలింగేశ్వర ఆలయ వార్షిక ఉత్సవాల నిర్వాహకులు వేలంలో పాల్గొనకుండా ముస్లింలను నిషేధించారు. మార్చి 31న జరిగే బిడ్‌లో పాల్గొనేందుకు హిందువులు మాత్రమే అర్హులని నిర్వాహకులు ఆహ్వానంలో స్పష్టం చేశారు. అదేవిధంగా, ఉడిపి జిల్లాలోని కౌప్‌లోని హోసా మరిగుడి ఆలయం ఈ వారం నిర్వహించే వార్షిక జాతర కోసం మార్చి 18న నిర్వహించిన వేలంలో ముస్లింలకు స్టాల్స్ కేటాయించడానికి నిరాకరించింది.
దుకాణాల వేలంలో హిందువులకు మాత్రమే అనుమతిస్తూ తీర్మానం చేశామని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు రమేష్ హెగ్డే తెలిపారు. హిందూ జాగరణ వేదిక మంగళూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కుక్కేహళ్లి మాట్లాడుతూ హిజాబ్‌పై హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు తమ దుకాణాలను మూయించడంతో స్థానిక ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.
దక్షిణ కన్నడ జిల్లాలో, బప్పనాదుయి శ్రీ దుర్గాపమేశ్వరి ఆలయ వార్షిక ఉత్సవాల హోర్డింగ్‌లో ఇలా పేర్కొన్నారు: “చట్టాన్ని లేదా భూమిని గౌరవించని, మనం ప్రార్థన చేసే గోవులను చంపే, ఐక్యతకు విరుద్ధమైన వ్యక్తులు వ్యాపారం చేయడానికి అనుమతించబడరు. వారిని వ్యాపారం చేయడానికి అనుమతించము. హిందువులు మేల్కొంటున్నారు.”
మంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ మాట్లాడుతూ ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనేది ఆరా తీస్తున్నామని చెప్పారు. పౌరసామ్సతః ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంటే, తాము తమ న్యాయ బృందాన్ని సంప్రదించి తదనుగుణంగా చర్య తీసుకుంటామని తెలిపారు.
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ఉడిపి జిల్లా వీధి వ్యాపారులు, వ్యాపారుల సంఘం కార్యదర్శి మహ్మద్ ఆరిఫ్ పేర్కొన్నారు. “సుమారు 700 మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. అందులో 450 మంది ముస్లింలు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మాకు ఎలాంటి వ్యాపారం లేదు. ఇప్పుడు మేము మళ్లీ సంపాదించడం ప్రారంభించినప్పుడు, ఆలయ కమిటీలు మమ్ములను పక్కన పెడుతున్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురైన శివమొగ్గలో మంగళవారం ప్రారంభమైన కోటే మరికాంబ ఉత్సవాలకు ముస్లిం దుకాణదారులను దూరంగా ఉంచారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు షైక్ మరియప్ప విలేకరులతో మాట్లాడుతూ కమిటీ గతంలో ఎన్నడూ మతతత్వానికి చెందలేదని, అయితే ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో ముస్లింల దుకాణదారులపై చాలా మంది ప్రచారాలు ప్రారంభించారని, సజావుగా జరగాలనే ఉద్దేశ్యంతో వారి డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చిందని తెలిపారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు