
Image Source: https://zeenews.india.com/
శివాజీ విగ్రహ ఏర్పాటులో కొంత మంది ముస్లిం మూక అల్లర్లు సృష్టించి స్థానికులపై రాళ్లతో దాడి చేసిన ఘటన ఆదివారం బోధన్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా బోధన్ నగరంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, హిందూ సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గతంలో విగ్రహ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే అనుమతినిచ్చారు. ఆ తర్వాత స్థానిక మున్సిపాలిటీలో వివిధ పార్టీలకు చెందిన 23మంది కౌన్సిలర్ల మద్దతుతో తీర్మానం చేశారు. ఎంఐఎం పార్టీ ఈ తీర్మాణాన్ని వ్యతిరేకించినా కౌన్సిల్లో ఓటింగ్ ద్వారా విగ్రహానికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా వివిధ కారణాల వల్ల విగ్రహ ఏర్పాటు ప్రక్రియ వాయిదా పడుతోంది. అయితే 19వ తేదీ (శనివారం) రాత్రి కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట చేసి ఆదివారం ఉదయం ఆవిష్కరణ సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ముస్లిములు, ఎంఐఎం పార్టీ మద్దతుదారులు సుమారు 100కు పైగా ఆ ప్రాంతంలో గుమికూడి విగ్రహ ఆవిష్కరణ కోసం వచ్చిన వారిపై రాళ్లతో దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విగ్రహ ఏర్పాటుకు వచ్చిన వారిపై కూడా లాఠీచార్జ్ చేసారు. పరిస్థితి అదుపు తప్పడంతో 144 సెక్షన్ విధించారు. విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన హిందువులకు నిలువనీడ ఉండడంటూ అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్ ఇమ్రాన్ మీడియా ద్వారా హెచ్చరించడం గమనార్హం.
శనివారం జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. హిందువులపై రాళ్లదాడికి పాల్పడిని వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ పట్టణ బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.
More Stories
రాబోయే ఐదేళ్లలో నంబర్-1గా భారత ఆటోమొబైల్ పరిశ్రమ
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం