
జాతీయ వాహన తుక్కు విధానంలో భాగంగా ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్), వాహన తుక్కు కేంద్రాల (ఎస్వీఆర్‌ఎఫ్) ఏర్పాటుపై కేంద్రం మార్గదర్శకాలను జారీచేసింది. ‘వ్యక్తులు, స్పెషల్ పర్పస్ వాహనాలు, కంపెనీలు, సంస్థలు, రాష్ట్రప్రభుత్వాలు తమ పేరు మీద ఏటీఎస్‌ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని తెలిపింది.
అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి సింగిల్ విండో విధానం ఉంటుందని వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తామని పేర్కొన్నది. కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో అనుమతులు లభిస్తాయని తెలిపింది.
‘ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ర్యాంకుకు తక్కువ కాని వ్యక్తి ఈ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ అధికారిగా ఉంటారు’ అని వెల్లడించింది. మార్చిలో బడ్జెట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం జాతీయ వాహన తుక్కు విధానాన్ని ప్రకటించింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ లభిస్తుందని పేర్కొన్నది.
ఫిట్‌నెస్ కేంద్రాలపై మార్గదర్శకాలు
- ఏటీఎస్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో వాహనం పాస్ అయితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీచేస్తారు. ఫెయిల్ అయితే మళ్లీ టెస్టు నిర్వహించాలని వాహన యజమాని కోరవచ్చు. కానీ, దీనికి నిర్దిష్ట రుసుము చెల్లించాలి.
- రీ-టెస్టులోనూ ఫెయిల్ అయితే వాహన కాలపరిమితి ముగిసినట్టే. వాహన యజమానికి అభ్యంతరాలు ఉంటే అప్పిలేట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అథారిటీ మళ్లీ టెస్టు నిర్వహించవచ్చు/నిర్వహించకపోవచ్చు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ విషయంలో అప్పిలేట్ అథారిటీదే తుది నిర్ణయం.
- టెస్టింగ్ నిర్వహించడానికి అన్ని సదుపాయాలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలి.
- మొదటి దశలో 75 ఏటీఎస్‌లను ఏర్పాటు చేస్తారు. తర్వాత వీటి సంఖ్యను 450-500కు పెంచుతారు.
తుక్కు కేంద్రాలపై మార్గదర్శకాలు
-
- వాహన తుక్కు కేంద్రం(ఎస్వీఆర్‌ఎఫ్) రిజిస్ట్రేషన్ గడువు పదేండ్లు. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి.
- ఈ కేంద్రాల్లో వాహనాలను యజమానులు అప్పజెప్పినప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు. ఇది కొత్త వాహనాల కొనుగోలులో ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాట్లు పొందడానికి అవసరం.
- దొంగతనం చేసిన వాహనాల వివరాలకు ఈ కేంద్రాల్లో ఎన్సీఆర్బీ డాటా అందుబాటులో ఉంటుంది.
- వాహనాల తుక్కుకు సంబంధించిన అనుమతులు, సర్టిఫికేషన్ అంతా డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. కాబట్టి ఒక రాష్ట్రం వాహనాలను మరో రాష్ట్రంలోని ఎస్వీఆర్‌ఎఫ్‌లలో కూడా తుక్కు చేయవచ్చు.
More Stories
రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు నిషేధం
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్