నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని, ఆ భయంతోనే బీజేపీని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విఆమె మర్శించారు.
రేవంత్ రెడ్డి గతం మరచిపోయి మాట్లాడుతున్నారని పేర్కొంటూ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సొంత పార్లమెంట్ స్థానమైన మహబూబ్‌నగర్‌లో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా, ప్రజలు బీజేపీనే గెలిపించారని ఆమె గుర్తు చేశారు. “మీ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి ఎంపీగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో మిమ్మల్ని ఓడించింది ఆ సామాన్య కార్యకర్తలే అన్న విషయం మర్చిపోతే ఎలా?” అని అరుణ ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే కాళేశ్వరం స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో మహిళలకు రూ.2,500, 2లక్షల ఉద్యోగాలు, తులం బంగారం ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయకుండా పాలమూరు భూములను పడావు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు పాడె కట్టారని చెబుతూ రాబోయే రోజుల్లో హామీలు విస్మరించిన కాంగ్రెస్‌ను కూడా రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

More Stories
పాలన గాలికొదిలి బీజేపీపై అక్కసా?
పంజాగుట్ట జీవీకే మాల్‌కు బాంబు బెదిరింపు
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడంలో మహిళా శక్తి కీలక పాత్ర