ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోని సౌరశక్తిని వినియోగించుకుని అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. భారీ మొత్తంలో డేటాను అంతరిక్షంలోనే ప్రాసెస్ చేసి, అవసరమైన సమాచారాన్ని భూమిపై వినియోగానికి అందిస్తాయి. తద్వారా భూమిపై భారీ డేటా సెంటర్ల ఏర్పాటుపై ఆధారపడకుండా అంతరిక్షంలోనే కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు.
సూపర్ ఇంటెలిజెన్స్ యుగంలో అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని ఎఫ్‌సీసీ ఛైర్మన్ బ్రెండన్ కార్ పేర్కొన్నారు. ‘‘అంతరిక్షంలోని డేటా సెంటర్ల కోసం 10 లక్షల ఆర్బిటల్ కంప్యూటింగ్ మాడ్యూళ్ల ఏర్పాటుకు తొలిసారిగా అనుమతి ఇవ్వడం ద్వారా ఎఫ్‌సీసీ కీలక ముందడుగు వేసింది. అమెరికా సాంకేతిక నాయకత్వం, ఆర్థిక వృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిర్ణయం కొత్త మార్గాలను తెరుస్తుంది’’ అని కార్ తెలిపారు.
సూపర్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారీ కంప్యూటింగ్ కేంద్రాలు, డేటా సెంటర్లు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. స్పేస్‌ఎక్స్‌తోపాటు అంతరిక్ష డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న ఇతర సంస్థలు కూడా ఈ అవసరాన్ని తీర్చేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతను సమన్వయం చేయడం ద్వారా ఆర్థిక ప్రగతికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ శాటిలైట్ నెట్‌వర్క్ నిర్వహణలో అంతరాయాలు తలెత్తకుండా స్పేస్‌ఎక్స్‌కు ఎఫ్‌సీసీ కొన్ని ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఉపగ్రహాల మధ్య కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే ఉన్న ఆప్టికల్ లింక్‌లకు అదనంగా రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్) వ్యవస్థను బ్యాకప్‌గా ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఉపగ్రహాల ట్రాకింగ్, టెలిమెట్రీ, కమాండ్ అండ్ కంట్రోల్ కార్యకలాపాలకు ఈ వ్యవస్థ తోడ్పడుతుంది.
ఈ ప్రాజెక్టు అమలుకు 2033 నవంబర్ నాటికి ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రారంభించాలి. గరిష్ఠంగా అనుమతించిన 10 లక్షల ఉపగ్రహాల్లో కనీసం 10 శాతం అంటే లక్ష ఉపగ్రహాలను 2035 నవంబర్ నాటికి కక్ష్యలో ప్రవేశపెట్టాలి. 2038 నవంబర్ నాటికి మొత్తం ఉపగ్రహాల్లో 50 శాతం ప్రయోగించాల్సి ఉంటుంది. సూర్యరశ్మి నిరంతరం అందుబాటులో ఉండే సన్ సింక్రోనస్ ఆర్బిట్ (సూర్య సమకాలిక కక్ష్య) లేదా ఇతర అనువైన కక్ష్యల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. అంతరిక్షంలోని సౌరశక్తిని నేరుగా వినియోగించుకోవడం వల్ల విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చని భావిస్తున్నారు.

More Stories
సీఐఏ, ఓడీఎన్ఐ విశ్లేషణ వ్యవస్థలపై సైబర్ దాడులు
సౌదీ రాజధానిపై హౌతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు
పాకిస్థాన్‌లో మళ్లీ తెరపైకి ‘సింధుదేశ్’ డిమాండ్