కివీస్‌పై భారత్ సంచలన విజయం

న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను భారత్ విజయంతో ముగించింది. బే ఓవల్ వేదికగా ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్లో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 వద్ద ఆలౌటైంది. డీన్ ఫాక్స్క్రాఫ్ట్ (31 పరుగులు) టాప్ స్కోరర్. భారత బౌలర్లు విజృంభించడంతో కివీస్ తేలిపోయింది.  తొలుత బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ. బౌలింగ్‌లో అద్భుతంగా పుంజుకున్న 

భారత జట్టు 209 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ అందుకోకుండా అడ్డుకుంది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను 48.1 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంతో సొంతగడ్డపై వరుసగా ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న న్యూజిలాండ్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాల పరంపరకు భారత్ తెరదించింది.

అర్షదీప్ సింగ్ 3, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో 2, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, నమన్ ధీర్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. తాజా విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మూడు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అర్షదీప్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే సిరీస్లో మూడు మ్యాచ్ల్లోనే తొమ్మిది వికెట్లు కూల్చిన భారత పేసర్ గుర్నూర్ బ్రార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (46 పరుగులు), ఇషాన్ కిషన్ (46 పరుగులు) టాప్ స్కోరర్లు. సీనియర్లు రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) మరోసారి విఫలమయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (18 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (22 పరుగులు), నమన్ ధీర్ (22 పరుగులు) భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. 

చివర్లో మహ్మద్ సిరాజ్ (14 పరుగులు), అర్షదీప్ సింగ్ (14 పరుగులు) అడపాదడపా షాట్లు ఆడడంతో టీమ్ఇండియా స్కోర్ 200 మార్క్ దాటింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్ చెరో 3, మ్యాథ్యూ ఫిషర్ 2, బ్లెయిర్ టిక్నర్, మిచెల్ బ్రేస్వెల్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

ఈ విజయంతో న్యూజిలాండ్ సొంతగడ్డపై వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో కొనసాగిన విజయాల పరంపరకు భారత్ బ్రేక్ వేసింది. 2019లో చివరిసారిగా భారత్ చేతిలోనే న్యూజిలాండ్ స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. ఏడేళ్ల తర్వాత మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎదురైంది. భారత బ్యాటింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపించినప్పటికీ, బౌలింగ్ విభాగం వాటిని కప్పిపుచ్చుతూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

About The Author