కామన్వెల్త్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు సత్తా

అహ్మదాబాద్‌ లో జరిగిన అరంగేట్ర కామెన్వెల్త్‌ కబడ్డీ  ఛాంపియన్‌షిప్‌–2026లో భారత జట్లు అదరగొట్టాయి. తొలి టోర్నీలోనే భారత పురుషుల, మహిళల జట్లు సంపూర్ణ ఆధిపత్యంతో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. మహిళల విభాగంలో ఓటమెరుగకుండా ఫైనల్‌ చేరిన భారత్‌ 35-15తో ఉగాండాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది.

శనివారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల జట్టు 54–20తో శ్రీలంకను చిత్తు చేయగా, మహిళల జట్టు 35–15తో ఉగాండాపై ఘన విజయం సాధించింది. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో రెండు భారత జట్లూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా విజేతలుగా నిలిచాయి.

పురుషుల ఫైనల్లో భారత ఆటగాళ్లు 14 రైడ్లలో 10 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో నాలుగు బోనస్‌ పాయింట్లు ఉన్నాయి. భరత్‌ హూడా ద్వితీయార్థంలో ఎనిమిది రైడ్‌ పాయింట్లు సాధించాడు. పంకజ్‌ మోహితే ఆరు, వైస్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ ఐదు పాయింట్లు జోడించారు. రక్షణ విభాగంలో యోగేశ్‌ దహియా ఐదు ట్యాకిల్‌ పాయింట్లతో ‘హై ఫైవ్‌’ నమోదు చేశాడు. తాను చేసిన ఐదు ట్యాకిల్‌ ప్రయత్నాలనూ విజయవంతం చేశాడు.

భారత్‌ తొలి అర్ధభాగంలోనే శ్రీలంకకు రెండు సార్లు ఆలౌట్‌ విధించింది. విరామ సమయానికి 30–10తో భారీ ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ మరో రెండు ఆలౌట్లు నమోదు చేసి మ్యాచ్‌ను 54–20తో ముగించింది. భారత్‌ 30 రైడ్‌ పాయింట్లు, 14 ట్యాకిల్‌ పాయింట్లు సాధించగా,  శ్రీలంక 11 రైడ్‌, తొమ్మిది ట్యాకిల్‌ పాయింట్లకే పరిమితమైంది.ఈ విజయంతో భారత పురుషుల జట్టు టోర్నీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది.  సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను 56–27తో ఓడించింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్‌ను అందుకుంది. టోర్నీ మొత్తంలో భారత్‌ 380 పాయింట్లు సాధించి, ప్రత్యర్థులకు 193 పాయింట్లు మాత్రమే ఇచ్చింది.

మహిళల ఫైనల్లో భారత జట్టు 35–15తో ఉగాండాపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. సాక్షి 10 రైడ్లలో తొమ్మిది పాయింట్లు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. తొలి అర్ధభాగంలోనే ఏడు పాయింట్లు సాధించి జట్టు ఆధిక్యానికి బాటలు వేసింది. అను ఆరు రైడ్‌ పాయింట్లు సాధించగాm కెప్టెన్‌ నిధి శర్మ ఐదు పాయింట్లతో రాణించింది. రక్షణ విభాగంలో రీతు, సుమన్‌ చెరో నాలుగు ట్యాకిల్‌ పాయింట్లు సాధించారు.

తొలి అర్ధభాగంలో భారత్‌ 22–7తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో ఉగాండా కొంత పోటీ ఇచ్చినా భారత జట్టు ఆధిపత్యం కొనసాగించింది.  ఉగాండా తరఫున నకయోంగో షిరాత్‌ 11 పాయింట్లతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది. ఆరు మ్యాచ్‌ల్లో 52 పాయింట్లు సాధించిన సాక్షి టోర్నీలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. వి 

About The Author